కన్నప్ప కంటే ముందు పదేళ్ల క్రితం ప్రభాస్‌...!

హిందీలో ప్రభాస్ గెస్ట్‌ అప్పియరెన్స్ విషయానికి వస్తే... అజయ్ దేవగన్‌ డబుల్‌ రోల్‌ లో నటించిన యాక్షన్‌ జాక్సన్ సినిమాలో పంజాబీ పాటలో సోనాక్షి తో కలిసి రెండు స్టెప్స్ వేశాడు.

Update: 2024-06-24 10:16 GMT

మరో రెండు రోజుల్లో ప్రభాస్ కల్కి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా దాదాపుగా పూర్తి చేశారు, సాధ్యం అయినంత ఎక్కువగా ఈ సినిమాను యూనిట్‌ సభ్యులు ప్రమోషన్ చేయడం జరిగింది.

 

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌ హీరో. కనుక అన్ని భాషల్లో కూడా కల్కి సినిమా ను పోటీ లేకుండా సోలో రిలీజ్ ప్లాన్‌ చేశారు. మొదటి మూడు రోజుల్లోనే సాధ్యం అయినంత ఎక్కువ వసూళ్లు సాధించేందుకు నిర్మాతలు మరియు బయ్యర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరో వైపు ప్రభాస్‌ సలార్‌ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్ ఇటీవల మంచు విష్ణు కోసం 'కన్నప్ప' సినిమాలో గెస్ట్‌ రోల్‌ లో నటించాడు. టీజర్ లో ప్రభాస్ కి సంబంధించిన షాట్స్ రావడంతో కన్నప్ప సినిమా స్థాయి అమాంతం పెరిగింది.

కన్నప్ప లో ప్రభాస్ మొదటి సారి గెస్ట్‌ రోల్‌ చేస్తున్నాడని అంతా భావిస్తున్నారు. కానీ పదేళ్ల క్రితమే ప్రభాస్‌ ఒక హిందీ సినిమాలోని పాటలో హీరోయిన్‌ సోనాక్షి సిన్హాతో కలిసి స్టెప్స్ వేయడం ద్వారా గెస్ట్‌ అప్పియరెన్స్ ఇవ్వడం జరిగింది.

Read more!

పదేళ్ల తర్వాత టాలీవుడ్‌ మూవీ కన్నప్ప లో ప్రభాస్ గెస్ట్‌ అప్పియరెన్స్ ఇవ్వడం జరిగింది. హిందీలో ప్రభాస్ గెస్ట్‌ అప్పియరెన్స్ విషయానికి వస్తే... అజయ్ దేవగన్‌ డబుల్‌ రోల్‌ లో నటించిన యాక్షన్‌ జాక్సన్ సినిమాలో పంజాబీ పాటలో సోనాక్షి తో కలిసి రెండు స్టెప్స్ వేశాడు. ఏక్ నిరంజన్‌, యోగి సినిమాల్లో ఎలా అయితే కనిపించాడో అలాగే యాక్షన్‌ జాక్సన్‌ సినిమా పాటలో ప్రభాస్ కనిపిస్తాడు.

Full View
Tags:    

Similar News