ప్రభాస్.. ఇంతకంటే ఇంకా ఏం కావాలి?

బాహుబలి 2 తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ రారాజుగా మారిన డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు కింగ్ అయిపోయాడు.

Update: 2024-07-03 12:48 GMT

కల్కి 2898ఏడీ మూవీ పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతోంది. ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 680+ కోట్ల కలెక్షన్స్ అందుకొని ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఎవ్వరూ సాధించని హైట్స్ ని అందుకునే దిశగా అడుగులువేస్తోంది. డార్లింగ్ ప్రభాస్ స్టార్ ఇమేజ్ సినిమాకి దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు వచ్చేలా చేస్తోంది. బాహుబలి 2 తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ రారాజుగా మారిన డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు కింగ్ అయిపోయాడు.


బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నుంచి గత ఏడాది వచ్చిన జవాన్, పఠాన్ కలెక్షన్స్ రికార్డ్ ని నార్త్ అమెరికాలో చాలా ఈజీగా కల్కి 2898ఏడీ మూవీ అందుకుంది. ఐదు రోజుల్లోనే 12 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా కల్కి మూవీ నిలబడింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ స్టార్ కూడా ఈ స్థాయిలో నార్త్ అమెరికాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇదంతా ప్రభాస్ స్టామినా, కల్కి కథ గొప్పతనం అని చెప్పొచ్చు.

Read more!

ఇక నార్త్ ఇండియాలో గత కొంతకాలంలో స్టార్ హీరోలు అందరూ సరైన సక్సెస్ లు అందుకోలేక బోల్తా పడుతున్నారు. కమర్షియల్ ఫెయిల్యూర్స్ సొంతం చేసుకుంటున్నారు. అయితే ప్రభాస్ మాత్రం వరుసగా సలార్, కల్కి 2898ఏడీ సినిమాలతో సత్తా చాటాడు. కల్కి మూవీ నార్త్ ఇండియాలో ఇప్పటికే 150+ కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికి నార్త్ లో 40 నుంచి 50 శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే జోరు కొనసాగితే 200+ కలెక్షన్స్ ని హిందీలో అందుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ప్రభాస్ డిజాస్టర్ మూవీ ఆదిపురుష్ కూడా హిందీలో మంచి వసూళ్లు సాధించింది. ఇక టాలీవుడ్ లో అయితే ఎవరు అందుకోలేని హైట్స్ ని ప్రభాస్ చేరిపోయాడని చెప్పొచ్చు. కల్కి సినిమా విషయంలో కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్న కూడా ఆడియన్స్ మాత్రం సినిమాని ఆదరిస్తున్నారు. కల్కిపై జరిగే నెగిటివ్ ప్రచారన్ని అస్సలు పట్టించుకోవడం లేదు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ ఉన్నాడు. అలాగే అత్యధిక బిజినెస్ ఉన్న స్టార్ గా కూడా డార్లింగ్ తన హవా కొనసాగిస్తున్నాడు. భవిష్యత్తులో ఇండియా నుంచి యాక్టర్ గా మొట్టమొదటి ఆస్కార్ అవార్డుని ప్రభాస్ అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. సినిమా సినిమాకి కంటెంట్ పరంగా వేరియేషన్ చూపిస్తూ లార్జర్ దెన్ లైఫ్ కథలతో ప్రభాస్ సినిమాలు చేస్తూ తెలుగువారందరూ గర్వపడే రేంజ్ కి దూసుకుపోతున్నాడు.

Tags:    

Similar News

eac