సౌత్ ఇండియాలో ఏకైక వీరుడు మన ప్రభాస్!
ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూలు చేసి అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.
ప్రభాస్.. ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. దేశవిదేశాల్లో ఆయనకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అయితే రీసెంట్ గా డార్లింగ్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ థియేటర్లలో ఓ రేంజ్ లో అదరగొడుతోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూలు చేసి అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.
దీంతో ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో ఇప్పుడు మార్మోగిపోతోంది. బాహుబలి మూవీ వరకు ఒకెత్తు.. ఆ తర్వాత మరో ఎత్తు.. అన్నట్టు సాగింది ప్రభాస్ కెరీర్. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఆయన.. నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. అదే సమయంలో పలు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. లక్కీగా ప్రభాస్ బాహుబలితో హిట్ అందుకున్నారని పలువురు కామెంట్లు పెట్టారు.
అయితే బాహుబలి-2 తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు చేసినా.. అనుకున్నంత స్థాయిలో హిట్లు కొట్టలేకపోయారు ప్రభాస్. దీంతో సోషల్ మీడియాలో ఆయనను మరింత తక్కువ చేసే మాట్లాడేవాళ్లు ఎక్కువయ్యారు. కానీ వారి కామెంట్స్ లో నిజం లేదన్న విషయం తెలిసిందే. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ తో ఫ్లాపులు మూటగట్టుకున్న ప్రభాస్.. సలార్ తో గత ఏడాది మంచి హిట్ అందుకున్నారు. ఓపెనింగ్స్ తోపాటు వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి.
కానీ ఫ్యాన్స్ లో ఏదో వెలితి ఉంది. ఇప్పుడు వాటిని ఫుల్ ఫిల్ చేసేసింది నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ మూవీ. సలార్ కన్నా ముందు మూడు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయినా.. కల్కిపై ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. తొలి రోజు నుంచే భారీ వసూళ్లు రాబడుతూ అదరగొడుతోంది. ఇప్పుడు రూ.1000 వెయ్యి కోట్ల మైలు రాయిని దాటేసింది. అయితే ఇప్పటికే బాహుబలి-2తో రూ.1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ప్రభాస్.. మరోసారి ఆ ఘనత సాధించారు.
అలా రెండు సార్లు రూ.1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ఏకైక సౌత్ ఇండియా హీరోగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశారు. ఇటీవల బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. పఠాన్, జవాన్ సినిమాలతో ఆ ఘనత సాధించారు. ఆ రెండు మూవీలు భారీ వసూళ్లు రాబట్టాయి. సౌత్ లో మన ప్రభాస్ మాత్రమే. దీంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలతో ఆ మైలు రాయిని మళ్లీ మళ్లీ అందుకోవాలని ఆశిస్తున్నారు.