ఆ రెండు సినిమాలని దెబ్బ కొట్టిన కల్కి

కల్కి 2898ఏడీ మూవీ థియేటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఐదో రోజు కూడా మంచి వసూళ్లని రాబట్టినట్లు తెలుస్తోంది

Update: 2024-07-02 06:41 GMT

కల్కి 2898ఏడీ మూవీ థియేటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఐదో రోజు కూడా మంచి వసూళ్లని రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే వాటికి పోటీగా గాని, వారం రోజులు ముందుగా చిన్న సినిమాలు రిలీజ్ అయిన అస్సలు నిలబడవు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కూడా ప్రేక్షకులు ప్రయారిటీ స్టార్ హీరోల చిత్రాలకే ఉంటుంది. ఈ కారణం చిన్న సినిమాలు కమర్షియల్ గా దెబ్బ తింటాయి.

స్టార్ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోతే అప్పుడు చిన్న సినిమాలకి ఆదరణ ఉంటుంది. గతంలో సలార్ మూవీ రిలీజ్ టైంలోనే షారుఖ్ ఖాన్ డంకీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే సలార్ వేవ్ ముందు డంకీ నిలబడలేకపోయింది. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఉన్న కూడా ప్రేక్షకులు ఫస్ట్ ప్రయారిటీ డార్లింగ్ ప్రభాస్ సలార్ కి ఇచ్చారు. ఇప్పుడు కల్కి 2898ఏడీ మూవీ కారణంగా రెండు చిన్న సినిమాలు దెబ్బ తిన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

వాటిలో ఒకటి విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన మహారాజ మూవీ. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి వసూళ్లని రాబట్టింది. అయితే ఈ సినిమా వారం రోజులు బాగానే కలెక్షన్స్ అందుకుంది. ప్రేక్షకాదరణ పెరగడంతో కచ్చితంగా 100 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే అనూహ్యంగా కల్కి రిలీజ్ తర్వాత మహారాజ కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. కల్కి కారణంగా మహారాజ కలెక్షన్స్ 85 కోట్లకి పరిమితం అయిపోయాయంట. కల్కి సినిమాకి తమిళంలో కూడా మంచి ఆదరణ లభిస్తోంది.

Read more!

మెల్లగా థియేటర్స్ పిక్ అప్ అవుతున్నాయి. కల్కి ఎఫెక్ట్ మహారాజ మీద స్ట్రాంగ్ గా పడిందనే మాట వినిపిస్తోంది. అలాగే హిందీలో చిన్న సినిమాగా వచ్చి అందరిని ఆకట్టుకుంటున్న హర్రర్ కామెడీ చిత్రం ముంజియా. ఈ సినిమా ఆరంభంలో మంచి వసూళ్లని అందుకుంది. కల్కి రిలీజ్ తర్వాత కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. హిందీలో మేగ్జిమమ్ ఆడియన్స్ కల్కి చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో 100 కోట్లు పక్కా అనుకున్న సినిమా ఇప్పటి వరకు 93 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది.

జులై 5న అజయ్ దేవగన్ కొత్త సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే కల్కి మూవీ జోరు చూసి ఆ సినిమా మేకర్స్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. నార్త్ లో కల్కి మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. మరి జులై 5న అజయ్ దేవగన్ మూవీ ప్రేక్షకులు ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News