కల్కి 2898ఏడీ… 625 నాట్ అవుట్

వీకెండ్ తో పోల్చుకుంటే ఐదో రోజైన సోమవారం కల్కి 2898ఏడీ కలెక్షన్స్ కొంతమేరకు తగ్గాయి

Update: 2024-07-02 10:10 GMT

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ కల్కి 2898ఏడీ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటూ అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం కల్కికి పోటీగా ఇండియన్ బాక్సాఫీస్ నుంచి ఎలాంటి సినిమాలు లేవు. మెజారిటీ థియేటర్స్ లో కల్కి మూవీనే ఆడుతోంది. సినిమాకి రిలీజ్ అయిన అన్ని భాషలలో పాజిటివ్ రివ్యూలు రావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

వీకెండ్ తో పోల్చుకుంటే ఐదో రోజైన సోమవారం కల్కి 2898ఏడీ కలెక్షన్స్ కొంతమేరకు తగ్గాయి. అయిన కూడా వరల్డ్ వైడ్ గా 70 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. తెలుగు భాషలలో డీసెంట్ కలెక్షన్స్ ని ఈ చిత్రం రాబడుతోంది. నార్త్ ఇండియాలో ఐదో రోజు 20 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. దీంతో హిందీ వెర్షన్ వసూళ్లు 135 కోట్లకి చేరింది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే 625 కోట్ల గ్రాస్ కల్కి 2898ఏడీ ఐదు రోజుల్లో అందుకుంది.

ఇదే జోరు కొనసాగితే వారం పది రోజుల్లో కల్కి మూవీ 1000 కోట్ల గ్రాస్ ని టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం నైట్ షోలకి కాస్తా ఆక్యుపెన్సీ తగ్గిందంట. 3డీ వెర్షన్ కి నైట్ షోలకి తెలుగు రాష్ట్రాలలో 55.43% థియేటర్స్ లో ఆక్యుపెన్సీ నమోదైంది. హిందీలో 47.28%, కోలీవుడ్ లో 28.14% థియేటర్స్ ఆక్యుపెన్సీ అయ్యిందంట. దీనిని అయితే 2డీ వెర్షన్ కి మాత్రం మంచి ఆదరణ లభిస్తుందంట.

ఇక ఓవర్సీస్ మార్కెట్ లో చూసుకుంటే ఐదు రోజుల్లో 12 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కల్కి 2898ఏడీ సాధించింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని నార్త్ అమెరికాలో కల్కి వసూళ్లు చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 625+ కోట్ల వసూళ్లతో సలార్ కలెక్షన్స్ ని బీట్ చేసే దిశగా కల్కి అడుగులేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు తగ్గిస్తే కలెక్షన్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ ఇమేజ్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్ గా కమల్ హాసన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. కల్కి 2898ఏడీ పార్ట్ 1 కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ తో పార్ట్ 2 మీద విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ వచ్చే 2025 ఆఖరులో లేదంటే 2026లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.

Tags:    

Similar News

eac