కల్కి రిలీజ్ డేట్.. నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే..!

ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా కల్కి. మొన్నటి వరకు దీనినే ప్రాజెక్ట్ కె అని పిలిచారు.

Update: 2023-08-07 12:43 GMT

ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా కల్కి. మొన్నటి వరకు దీనినే ప్రాజెక్ట్ కె అని పిలిచారు. కొద్ది రోజుల క్రితమే మూవీ టైటిల్ ని ప్రకటించి, ఓ చిన్నపాటి టీజర్ ని విడుదల చేశారు. టీజర్ చూసిన తర్వాత మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో మూవీ ఎప్పుడెప్పుడు విడుదలౌతుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే, ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దాని ప్రకారం, కల్కి మూవీ వాయిదా పడింది అని. నిజానికి దీనిని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ, సంక్రాంతికి రాదు, మే అవ్వచ్చు అంటూ నెట్టింట వార్తలు వచ్చాయి. ఇది విని ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే, ఈ వార్తలపై తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు.

కల్కి షూటింగ్ దాదాపు పూర్తైపోయిందని చెప్పారు. కేవలం కొంచెం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని నాగ్ అశ్విన్ తెలిపారు. తాను ప్రస్తుతం ఆ పని మీదే ఫోకస్డ్ గా ఉన్నానని, అది పూర్తైన తర్వాత తాను రిలీజ్ డేట్ ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఈ మూవీ చూసిన తర్వాత సరి కొత్త ప్రపంచాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది ఆయన అన్నారు.

ఇప్పటి వరకు చూడని కొత్త ప్రభాస్ ని ఇందులో చూస్తారు అని ఆయన అన్నారు. కాగా, నాగ్ అశ్విన్ మాటలు విన్న తర్వాత ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఈ లెక్కన మూవీ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆదిపురుష్ తో నిరుత్సాహ పరిచిన ప్రభాస్ కనీసం కల్కితో అయినా, మళ్లీ బ్యాక్ టూ ఫామ్ లో కి రాకపోతాడా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనితో పాటు సలార్ మూవీపై కూడా అంచనాలు ఉన్నాయి.

ఈ కల్కి సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే, సలార్ కూడా రెండు భాగాలు అని ప్రకటించారు. కల్కిలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి సీనియర్లు దీపికా పదుకొణె,దిశా పటానీ లాంటి బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తుండటం విశేషం.

Tags:    

Similar News