రూ.100+ కోట్లు... మళ్లీ మళ్లీ ప్రభాస్ కే సాధ్యం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద సాధించిన వసూళ్లు ఆ సమయంలో అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెల్సిందే. బాహుబలి రెండు పార్ట్ లు కూడా హిందీ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్ మరియు ఆదిపురుష్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. అయినా కూడా హిందీ బాక్సాఫీస్ వద్ద అవి మినిమం వసూళ్లు నమోదు చేయడం జరిగింది.
రాధేశ్యామ్ మినహా సాహో మరియు ఆదిపురుష్ సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టాయి. ఇప్పుడు సలార్ కూడా అక్కడ ఏకంగా 125 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేయడం జరిగింది. ముందు ముందు మరో పాతిక కోట్ల వరకు వసూలు దక్కించుకునే అవకాశం ఉంది.
సలార్ పార్ట్ 2 కూడా హిందీ లో వంద కోట్లను మించడం ఖాయం. అంతే కాకుండా కల్కి 2898 ఏడీ, స్పిరిట్ సినిమాలు కూడా ఫలితం తో సంబంధం లేకుండా హిందీ ప్రేక్షకుల నుంచి వంద కోట్లు కొల్లగొట్టడం ఖాయం. ఇక మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమా హిట్ అయితే తప్పకుండా హిందీలో వంద కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి హిందీ హీరోలే అక్కడ వంద కోట్ల వసూళ్లు సాధించేందుకు కిందా మీదా పడుతూ ఉంటే ప్రభాస్ మాత్రం ప్రతి సినిమా తో మినిమం వంద కోట్ల వసూళ్లు రాబట్టడం జరుగుతోంది. అందుకే అసలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.