యాదృచ్చికం కాకపోతే మరేంటి?

బాహుబలి మూవీతో సౌతిండియా ఇండస్ట్రీకి కొత్త అభయం లభించినట్లైంది.

Update: 2024-06-28 04:24 GMT

యాదృచ్చికం కాకపోతే మరేంటి? ఒక ప్రముఖ హీరో నటించిన సినిమాలు ఒకటి తర్వాత ఒకటి పార్టుల రూపంలో పెండింగ్ లో పడటం.. వాటి కోసం ప్రేక్షకులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సి రావటానికి మించిన ఇబ్బంది ఇంకేం ఉంటుంది. బాహుబలితో తెలుగు సినిమాను పార్టుల చొప్పున తీసే ప్రక్రియ ఊపందుకున్న పరిస్థితి. భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమాల్ని ఒకే సినిమాగా చేస్తే.. చెప్పాల్సిన కథ చెప్పలేకపోవటం.. ఆ సినిమాకు వచ్చే కలెక్షన్లు బడ్జెట్ తో మ్యాచ్ కాకపోవటం.. మొత్తంగా పార్టుల చొప్పున తీయటం మొదలెట్టారు. బాహుబలి 1తో విపరీతమైన క్రేజ్ తో పాటు అంచనాలకు మించిన కలెక్షన్లతో కొత్త చరిత్రను క్రియేట్ చేసిన రాజమౌళి బాటలో పలువురు దర్శకులు.. నిర్మాతలు రంగంలోకి దిగటం తెలిసిందే.

బాహుబలి మూవీతో సౌతిండియా ఇండస్ట్రీకి కొత్త అభయం లభించినట్లైంది. ఈ మూవీ విడుదలై తొమ్మిదేళ్లు అవుతున్నా.. దీని గురించే మాట్లాడుకునే పరిస్థితి. ఈ మూవీ విడుదల తర్వాత అది సాధించిన సక్సెస్ తో అప్పటి వరకు తెలుగు చిత్ర నిర్మాతల ఆలోచన తీరు మొత్తంగా మారిపోయింది. అప్పటి వరకు పార్టుల వారీగా సినిమాల్ని తీస్తే ప్రేక్షకులు చూస్తారా? ఆదరిస్తారా? అన్న సందేహాలు పటాపంచలు కావటమే కాదు.. పలు క్రేజీ చిత్రాలకు తెర తీశారు.

అందులో భాగంగానే వచ్చిన సలార్.. తాజా కల్కితో పాటు మరిన్ని సినిమాలు ఉన్నాయి. కాకుంటే.. మరే హీరోకు రానట్లుగా.. అత్యంత భారీ చిత్రాల్లో డార్లింగ్ ప్రభాస్ హీరో కావటం.. ఆయన చేసే సినిమాల్లో ఎక్కువగా పార్టుల వారీగా మేక్ అవుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ 1కు కొనసాగింపుగా రావాల్సిన సలార్ 2 ఇప్పటివరకు ఒక కొలిక్కి రాలేదు. వచ్చే ఏడాది విడుదల అవుతుందన్న అంచనాలు ఉన్నప్పటికీ.. దానికి సంబంధించి పక్కా డేట్ ను సదరు మూవీ టీం ఇవ్వకపోవటం తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ నటించిన సలార్ కు సంబంధించిన పార్టు 2 కోసం ప్రేక్షకులు వెయిటింగ్ చేస్తుంటే.. ఇప్పుడు కల్కి ఆ వరుసలో చేరింది.

సలార్ రెండో పార్టు.. కల్కి రెండో పార్టు.. ఈ సినిమాలు పూర్తై ప్రేక్షకుల ముందుకు వచ్చేదెప్పుడు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇలా ఒకటి తర్వాత ఒకటి చొప్పున తాను తీసే సినిమాలన్ని పార్టుల వారీగా మారటం డార్లింగ్ అభిమానులే కాదు.. సగటు సినీ ప్రేక్షకులు సైతం ఈ నిరీక్షణ ఏంది డార్లింగ్ అంటూ ముద్దుగా కంప్లైంట్లు చేస్తున్న పరిస్థితి.

Tags:    

Similar News