ప్ర‌భాస్ విశ్రాంతి తీసుకునే దేశం ఇదే

ఈ సినిమా కోసం అలుపెర‌గ‌ని షెడ్యూల్స్ లో బిజీగా గ‌డిపిన ప్ర‌భాస్ ఇప్పుడు విశ్రాంతి కోసం యూర‌ప్ ట్రిప్ వెళుతున్నాడ‌ని స‌మాచారం.

Update: 2024-06-22 13:25 GMT

డార్లింగ్ ప్ర‌భాస్ నటించిన పాన్ ఇండియ‌న్ చిత్రం 'కల్కి 2898 AD' భారీ అంచనాల న‌డుమ ఈ గురువారం విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. సినిమా అడ్వాన్స్ సేల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. భార‌త్ తో పాటు, విదేశాల్లోను ఈ సినిమా భారీ ఓపెనింగులు సాధించ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా. నాగ్ అశ్విన్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రానికి అశ్వ‌నిద‌త్ నిర్మాత‌. వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై అత్యంత భారీగా తెర‌కెక్కింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

ఈ సినిమా కోసం అలుపెర‌గ‌ని షెడ్యూల్స్ లో బిజీగా గ‌డిపిన ప్ర‌భాస్ ఇప్పుడు విశ్రాంతి కోసం యూర‌ప్ ట్రిప్ వెళుతున్నాడ‌ని స‌మాచారం. ప్ర‌భాస్ క‌ష్టం ఫ‌లించే స‌మ‌యం వ‌చ్చింది. క‌ల్కి చిత్రానికి భారీ బ‌జ్ నెల‌కొంది. ఇలాంటి స‌మ‌యంలో అత‌డు త‌న వెకేష‌న్ ని ప్లాన్ చేసాడు. సెంట‌మెంటుగా ఎప్ప‌టిలానే అత‌డు త‌న సినిమా రిలీజ్ స‌మ‌యంలో అందుబాటులో ఉండ‌డ‌ని తెలుస్తోంది.

అమెరికాలో ప్రీమియ‌ర్ల‌ దూకుడు:

ప్రభాస్ కల్కి 2898 AD ఉత్తర అమెరికాలో ప్రీమియర్ డే అమ్మకాలలో దూకుడు మీద ఉంది. ఈ సినిమా ప్రీమియ‌ర్ల ద్వారా 17కోట్లు (US $ 2.2 మిలియన్ల) వ‌సూలు చేస్తోంద‌ని స‌మాచారం. నాగ్ అశ్విన్ భవిష్యత్ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD విడుదలకు కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఉత్తర అమెరికాలో (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా , కెనడా) భారీ వసూళ్లను నమోదు చేయడం ఖాయంగా క‌నిపిస్తోంది. బాహుబలి సిరీస్, KGF ఫ్రాంచైజీ, జవాన్, యానిమల్ చిత్రాలు ఈ ఏరియా నుంచి అత్యంత భారీగా వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఉత్తర అమెరికా మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా దేశం వెలుపల భారతీయ చిత్రాలకు అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా మారింది.

2.2 మిలియ‌న్ డాల‌ర్ల‌లో 2 మిలియన్ల డాల‌ర్ల‌ను కేవలం అమెరికా నుండి మాత్రమే వ‌సూలు చేయ‌గా, దాదాపు 66,000 టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. మిగిలిన వ‌సూళ్లు కెనడా నుండి వస్తున్నాయి. SS రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ల RRR US $ 2.75 మిలియన్లతో .. ప్రభాస్ - ప్రశాంత్ నీల్‌ల సలార్: పార్ట్ 1 US $తో అత్య‌ధిక‌ ప్రీమియర్ డే వ‌సూళ్ల జాబితాలో నిలిచాయి. కల్కి నిర్మాతలు గురువారం కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. దాని ప్రభావం ఉత్తర అమెరికాలో టిక్కెట్ల అమ్మకాలపై స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంద‌ని స‌మాచారం. గత 24 గంటల్లో ఈ చిత్రం సుమారు 8000 టిక్కెట్లు విక్రయించగా US $ 220,000 పైగా వసూలు చేసింది.

ఇది నిజ‌మేనా?

ప్రభాస్ యూరప్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడని, అతడికి విలాసవంతమైన విల్లా ఉందని బలమైన పుకార్లు ఉన్నాయి. విరామం దొరికినప్పుడు ప్రభాస్ తరచూ యూరప్‌కు వెళ్తుంటాడు. యూర‌ప్ లోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో సేద‌దీర‌డానికి వెళ్లే ప్ర‌భాస్ కి త‌న సొంత విల్లా ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది.

Tags:    

Similar News