ఓవర్సీస్ మార్కెట్.. ప్రభాస్ తప్పితే..

తెలుగు సినిమాలలో వచ్చేసరికి ఒక్క ప్రభాస్ మాత్రమే ఓవర్సీస్ లో సాలిడ్ గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మిగిలిన హీరోలు ఎవరూ కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపించడం లేదు.

Update: 2024-03-10 06:23 GMT

ఇండియన్ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ కలెక్షన్స్ పరంగా చాలా కీలకంగా ఉంటుంది. ఓవర్సీస్ మార్కెట్ లో మంచి వసూళ్లు సాధించే సినిమాకి అత్యధిక కలెక్షన్స్ వస్తున్నాయి. ఓవర్సీస్ అంటే చాలా మంది యూఎస్ బాక్సాఫీస్ మాత్రమే పరిగణంలోకి తీసుకుంటున్నారు. అయితే ఇండియన్ సినిమాకి యూఎస్ తో పాటు యూకే, ఆస్ట్రేలియా, అరబిక్, మిడిల్ ఈస్ట్ దేశాలలో కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది.

ఆయా దేశాలలో సెటిల్ అయిన ఇండియన్స్ తో పాటు విదేశీయులు కూడా ఇప్పుడిప్పుడే భారతీయ సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్ లో తమిళ్, మలయాళీ, హిందీ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది. తెలుగు సినిమాలలో వచ్చేసరికి ఒక్క ప్రభాస్ మాత్రమే ఓవర్సీస్ లో సాలిడ్ గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మిగిలిన హీరోలు ఎవరూ కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపించడం లేదు.

ఓవర్సీస్ మార్కెట్ లో 4 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసిన చేసిన తెలుగు స్టార్స్ హీరోలలో ప్రభాస్ మాత్రమే ఎక్కువ సార్లు కనిపిస్తున్నాడు. ఇంకెవరు ఈ దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. బాలీవుడ్ సినిమాలకి చాలా ఈజీగా 4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. తమిళంలో విజయ్, రజినీకాంత్, అజిత్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ కి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది.

ఇండియాలో భారీ బడ్జెట్ తో ఎక్కువ సినిమాలు చేస్తోంది టాలీవుడ్ లోనే. కానీ వరల్డ్ వైడ్ గా మార్కెట్ పై ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో మాత్రం మన హీరోలు వెనుకబడి ఉన్నారు. ప్రభాస్ మాత్రమే తన మార్కెట్ రేంజ్ ని పెంచుకున్నాడు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న డార్లింగ్ ప్రభాస్ సినిమాలు ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ అందుకుంటున్నాయి. కానీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మిగిలిన స్టార్స్ దానిని అందుకోలేకపోతున్నారు.

మన స్టార్స్ మార్కెట్ పరిధిని పెంచుకుంటూనే వారి సినిమాలు 500 కోట్లకి పైగా కలెక్షన్స్ ఈజీగా అందుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ నెంబర్ లో కలెక్షన్స్ తెచ్చుకోవాలంటే సినిమాలు రిలీజ్ చేసే సమయంలో స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓవర్సీస్ మార్కెట్ పెంచుకోవాలంటే ఆయా దేశాలు కూడా వెళ్లి ప్రేక్షకులకి చేరువ అయ్యే ప్రయత్నం చేయాలి. అప్పుడు వారి సినిమాల కంటెంట్ కి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News