సలార్‌, కల్కి కి రాజాసాబ్‌ తక్కువేం కాదు...!

ప్రభాస్ సలార్‌ తో గత ఏడాది భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే

Update: 2024-07-02 12:30 GMT

ప్రభాస్ సలార్‌ తో గత ఏడాది భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఏడాది తిరగక ముందే మరో వెయ్యి కోట్ల సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కల్కి 2898 ఏడీ' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఇప్పటికే రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేస్తూ దూసుకు పోతుంది. లాంగ్ రన్‌ లో ఇండియన్‌ బాక్సాఫీస్ రికార్డులన్నింటిని కూడా కల్కి తిరగరాసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ప్రభాస్‌ కి ఇండియన్ సినిమా దాసోహం అనే పరిస్థితి కల్కి తీసుకు వచ్చిందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

సలార్‌ మరియు కల్కి సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా అంటే కచ్చితంగా పాన్‌ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా ను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2025 సంక్రాంతికి లేదా సమ్మర్‌ లో రాజాసాబ్ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కల్కి విడుదల అయిన వెంటనే రాజాసాబ్‌ సినిమా నిర్మాతలకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హిందీ తో పాటు ఇతర భాషల డబ్బింగ్‌ హక్కుల కోసం పెద్ద నిర్మాతలు పోటీ పడుతున్నారట.

Read more!

మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్ దత్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఒకప్పటి ప్రభాస్ ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దర్శకుడు మారుతి సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

బడ్జెట్‌ విషయంలో సలార్ మరియు కల్కి సినిమాలతో పోల్చితే రాజా సాబ్ బడ్జెట్‌ చాలా తక్కువ. ఆ సినిమాలకు చేసిన ఖర్చులో సగం ఖర్చు తో రాజా సాబ్‌ ను మారుతి పూర్తి చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే బిజినెస్ విషయంలో మాత్రం ఆ సినిమాల స్థాయిలోనే లెక్కలు నడుస్తున్నాయట.

ఇండస్ట్రీ వర్గాలు మరియు రాజా సాబ్ సినిమా ని నిర్మిస్తున్న పీపుల్స్ ఫ్యాక్టరీ వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు థియేట్రికల్‌ రైట్స్ మరియు నాన్ థియేట్రికల్‌ రైట్స్ కలిపి రూ.500 కోట్లు పలికే అవకాశాలు ఉన్నాయి. అంటే పెట్టిన బడ్జెట్‌ కి చాలా చాలా ఎక్కువ అన్నమాట. అందుకే రాజాసాబ్ తక్కువేం కాదని ఫ్యాన్స్‌ తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

Tags:    

Similar News

eac