రాజా సాబ్.. ఇంతకంటే మంచి శకునం మళ్ళీ రాదు..

ప్రభాస్ కెరీర్ లో "బాహుబలి" ఒక బిగ్ రికార్డ్. ఆ సినిమా తర్వాత అతని క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది.

Update: 2024-07-03 14:30 GMT

ప్రభాస్ కెరీర్ లో "బాహుబలి" ఒక బిగ్ రికార్డ్. ఆ సినిమా తర్వాత అతని క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. అయితే, "సాహో" మరియు "రాధే శ్యామ్" వంటి సినిమాలు అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ, ప్రభాస్ ఫ్యాన్ బేస్ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. "ఆదిపురుష్" వందల కోట్ల వసూళ్లు సాధించినా, ట్రోలింగ్ కారణంగా కాస్త విస్మయం కలిగించింది. అయినప్పటికీ, ప్రభాస్ మీదున్న అభిమానులు, సినిమా ప్రేక్షకుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదు.

ఇక "సలార్" మిక్స్‌డ్ రివ్యూలు అందుకున్నా, సూపర్ హిట్‌ గా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్ మరలా తన క్రేజ్‌ను పునరుద్ధరించుకున్నాడు. ఇక లేటెస్ట్ గా వచ్చిన "కల్కి 2898 ఏడి" సినిమాతో ప్రభాస్, మరోసారి తన సత్తా చాటాడు. బాహుబలి అనంతరం పర్ఫెక్ట్ హిట్ అనేలా టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా, ఆర్ఆర్ఆర్ రికార్డులను అధిగమించేలా దూసుకుపోతోంది.

ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమా "ది రాజా సాబ్" పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో నిర్మించబడుతోంది. మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మారుతీ అద్భుతమైన స్క్రిప్ట్ తో ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నాడట. "కల్కి" విజయాన్ని చూసిన తర్వాత "రాజా సాబ్" మీదున్న అంచనాలు మరింత పెరిగాయి.

Read more!

అసలైతే ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించకముందే సైలెంట్ గా స్టార్ట్ చేసేశారు. అయినప్పటికీ దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. మారుతితో ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడు అన్నట్లు కామెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు కల్కి హిట్టుతో ప్రభాస్ జడ్జిమెంట్ పై మరింత నమ్మకం పెరిగింది. ఇక కల్కి పాజిటివ్ వైబ్ తో రాజా సాబ్ కోసం కూడా ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు.

ఇక రాజా సాబ్ సినిమా నిర్మాణ ఖర్చు "కల్కి" కంటే తక్కువ అయినప్పటికీ, బిజినెస్ పరంగా అదే స్థాయిలో ఉండబోతుంది. ఉత్తరాది బయ్యర్లు పెద్ద ఎత్తున రేట్లు ఆఫర్ చేయడం జరుగుతోంది. ఇంకా విడుదల తేదీ నిర్ణయం తీసుకోకపోవడంతో డీల్స్ ఫైనలైజ్ కాలేదు. తక్కువ ఖర్చుతో నిర్మాతలు ఊహించని స్థాయిలో టేబుల్ ప్రాఫిట్ చూసే అవకాశం ఉంది. ప్రభాస్ రెమ్యునరేషన్ పక్కన పెడితే సినిమా ఖర్చు 130 కోట్ల రేంజ్ లోనే ఉంటుందట.

ఇక సినిమా అప్డేట్స్ వస్తే బజ్ మరింత పెరగవచ్చు. కాబట్టి మేకర్స్ తొందర పడకుండా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇంతకంటే మంచి శకునం రాజా సాబ్ కు మరొకటి ఉండదు. కావున మంచి హైప్ క్రియేట్ అయ్యేలా అప్డేట్స్ ఇవ్వాలి. ఇక ఈ సినిమాను 2025 వేసవిలో విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్లో విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Tags:    

Similar News

eac