ఫేక్ నెస్.. రాజా సాబ్ అలెర్ట్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కల్కి 2898ఏడీ మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకునే దిశగా అడుగులు పడుతున్నాయి

Update: 2024-07-05 07:46 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కల్కి 2898ఏడీ మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ సినిమాకి పబ్లిక్ నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. కచ్చితంగా వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని కల్కి మూవీ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా సిద్ధం అవుతోంది.

కంప్లీట్ గా ఒక ప్యాలస్ బ్యాక్ డ్రాప్ లోనే మూవీ కథ అంతా నడుస్తుందంట. ఇప్పటికే మూవీ సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యిందంట. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. అయితే వారి పాత్రలు ఏంటనేది రివీల్ కాలేదు. రాజాసాబ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇప్పటికే బయటకొచ్చింది. ఈ లుక్ లో ప్రభాస్ చాలా జోవియల్ గా కనిపిస్తున్నాడు.

దీనిని బట్టి ఆయన క్యారెక్టర్ చాలా కామిక్ గా ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించి ఒక ఫేక్ ప్రచారం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. రాజాసాబ్ మూవీ కోసం ఆడిషన్స్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియాని సంప్రదిస్తున్నట్లు సమాచారం. దీంతో చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఈ సినిమా ఆడిషన్స్ ప్రచారంపై క్లారిటీ ఇస్తూ నోట్ రిలీజ్ చేసింది.

Read more!

రాజాసాబ్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలని, ఆడిషన్స్ పేరుతో జరిగే మొసలి ఎంకరేజ్ చేయొద్దని అందరికి సూచించారు. ఏదైనా సమాచారం ఉంటే కచ్చితంగా మేమే అఫీషియల్ గా ప్రకటిస్తామని ఈ నోట్ లో పేర్కొన్నారు. ఈ నోట్ తో రాజాసాబ్ ఆడిషన్స్ అంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ పడినట్లు తెలుస్తోంది. ఇకపోతే రాజాసాబ్ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Tags:    

Similar News

eac