ఆ హీరోతో సినిమా.. ప్రభాస్ దీన్ని నిజం చేస్తే..

అలాగే రామ్ చరణ్ తారక్ మంచి ఫ్రెండ్ అని, భవిష్యత్తులో తామిద్దరం కచ్చితంగా కలిసి నటిస్తామని అన్నారు

Update: 2023-07-21 11:03 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కామిక్ కాన్ ఈవెంట్ లో తాజాగా లాంచ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి విపరీతమైన స్పందన వస్తోంది. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైథలాజికల్ కాన్సెప్ట్ కి సైన్స్ ఫిక్షన్ టచ్ ఇచ్చి సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఆవిష్కరించారు.

ఇక ఈ ఈవెంట్ లో హాలీవుడ్ మీడియా రాజమౌళి అలాగే తారక్, రామ్ చరణ్ గురించి కొన్ని ప్రశ్నలు వేసింది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ రాజమౌళి ప్రపంచంలో ఉన్న అతికొద్ది మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరు అని పేర్కొన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడితో సినిమాలు చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారని అన్నారు. అలాగే రామ్ చరణ్ తారక్ మంచి ఫ్రెండ్ అని, భవిష్యత్తులో తామిద్దరం కచ్చితంగా కలిసి నటిస్తామని అన్నారు.

మంచి కథతో వచ్చే మా కాంబినేషన్ లో సినిమా వస్తుందని అన్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ గొప్ప సినిమా, దానికి ఆస్కార్ అవార్డు రావడం భారతీయుడిగా గర్వపడుతున్నానని ప్రభాస్ చెప్పడం విశేషం. ఆస్కార్ అవార్డుకి రాజమౌళి వంద శాతం అర్హత ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపించడం విశేషం.

ప్రాజెక్ట్ కె గా స్టార్ట్ అయిన మూవీ ఇప్పుడు కల్కి 2898 ఏడీగా మారింది. ఓ విధంగా చెప్పాలంటే పవర్ ఫుల్ టైటిల్ తో ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ లెవల్ లో ప్రేక్షకులకి రీచ్ అయ్యే కాన్సెప్ట్ తో ప్రభాస్ ఈ మూవీ చేస్తున్నారని గ్లింప్స్ తో ప్రూవ్ అయ్యింది. ఇండియన్ భాషలతో పాటుగా ప్రపంచ భాషలలో ఈ సినిమాని ఏకకాలంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ ఈ మూవీలో ఉన్న నేపథ్యంలో ఇండియాలో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ తో నాగ్ అశ్విన్ కచ్చితంగా ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Tags:    

Similar News