సలార్ 2.. రిస్క్ తీసుకోవాల్సిందేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీకి థియేటర్స్ లో యావరేజ్ టాక్ వచ్చింది

Update: 2024-05-06 04:42 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీకి థియేటర్స్ లో యావరేజ్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ ఆ క్రేజ్ ను ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలలో ఇది బెస్ట్ అనే అభిప్రాయం వ్యక్తం అయినప్పటికి పూర్తి స్థాయిలో మాత్రం క్లిక్కవ్వలేదు అనే టాక్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 700+ కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. చిత్ర యూనిట్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తాయని అంచనా వేసింది. ఆ టార్గెట్ ని సలార్ రీచ్ కాలేకపోయింది. ఈ చిత్రానికి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఇంపాక్ట్ సలార్ కలెక్షన్స్ పై పడింది. అదే సమయంలో సినిమా కూడా పూర్తిస్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు.

కేజీఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ కారణంగా సలార్2 పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం ఉగ్రం సినిమానే సలార్ గా రీమేక్ చేశారనే టాక్ ప్రచారం అయ్యింది. బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టి ఖాన్సార్ అనే ఒక ఫిక్షనల్ మాఫియా సిటీ క్రియేట్ చేసి ఆ బ్యాక్ డ్రాప్ లో సలార్ ని గ్రాండ్ స్కేల్ పై చూపించారని కామెంట్స్ వినిపించాయి.

ఇది కూడా సినిమాపై నెగిటివిటీ పెరగడానికి కారణం అయ్యింది. కన్నడంలో అయితే సలార్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఉగ్రం మూవీ రీమేక్ అని వాళ్ళు స్పష్టం చేసేసారు. సలార్ మూవీ సినిమా నైజం, ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రమే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది. మిగిలిన చోట్ల ఫ్లాప్ అయ్యింది.

అయితే ఇప్పుడు సలార్ కి సీక్వెల్ గా శౌర్యంగ పర్వం తెరకెక్కించే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నారు. సలార్ కంటే ఎక్కువ బడ్జెట్ ఈ సీక్వెల్ కి పెట్టాల్సి ఉంటుందంట. సలార్ ఏవరేజ్ కావడంతో సలార్ 2పై ప్రేక్షకులకి పెద్ద ఆసక్తి కనిపించడం లేదు. అందుకే భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి సలార్ 2 చేయడం రిస్క్ అవుతుదనే ఆలోచనలో నిర్మాత విజయ్ కిరంగదూర్ ఉన్నారంట.

అయితే సలార్ క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా విడిచి పెట్టాడు. ఈ నేపథ్యంలో పార్ట్ 2 కచ్చితంగా హై లెవెల్లో డిజైన్ చేయాలని అనుకుంటున్నారు. మరి బడ్జెట్ విషయంలోనే దర్శక, నిర్మాతల మధ్య చర్చల కారణంగా మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

Tags:    

Similar News