సలార్ ఎదురుగా మరో డైనోసార్!

ఇండియన్ సూపర్ స్టార్స్ గా ఉన్న హీరోలు ఎవరంటే ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పేర్లు వెంటనే చెబుతారు.

Update: 2023-09-26 04:17 GMT

ఇండియన్ సూపర్ స్టార్స్ గా ఉన్న హీరోలు ఎవరంటే ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పేర్లు వెంటనే చెబుతారు. వారిద్దరి బ్రాండ్ వేల్యూ ఆ రేంజ్ లో ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. తరువాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో టాక్ రాకున్న కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించాయి. అదే సరైన కథ పడితే వెయ్యి కోట్లు పెద్ద లెక్క కాదు.

ఇక షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఆరంభంలో పఠాన్ తో, మరల ఇప్పుడు జవాన్ సినిమాతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని సాధించాడు. అరుదైన రికార్డ్ ని తన పేరు మీద సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం షారుఖ్ కి స్పీడ్ చూస్తుంటే రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రాబోతున్న డుంకీ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

అయితే ఇప్పుడు షారుఖ్ ఖాన్ కి పోటీగా డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అధికారికంగా అయితే ఈ డేట్ కన్ఫర్మ్ కాలేదు కాని సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. షారుఖ్ ఖాన్ డుంకీ కూడా అదే రోజు రిలీజ్ కాబోతోంది. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్ హీరోలు, ఇద్దరు స్టార్ దర్శకుల మధ్య డిసెంబర్ 22న ఆసక్తికరమైన పోటీ ఉండబోతోందని అందరూ భావిస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్స్ కూడా బాక్సాఫీస్ డైనోసర్లే. అలాగే ప్రశాంత్ నీల్, రాజ్ కుమార్ హిరాణీ కూడా ఇండియన్ వైడ్ గా క్రేజ్ ఉన్న దర్శకులే. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎంత వరకు కరెక్ట్ అనే క్వశ్చన్ ఇప్పుడు వస్తోంది.

రెండు చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ కానున్నాయి. హైప్, బజ్ పరంగా రెండింటికి ఒకే రేంజ్ ఉంది. మార్కెట్ స్కోప్ పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోయే సినిమాలే. అయితే ప్రభాస్ తో పోల్చుకుంటే షారుఖ్ ఖాన్ కి సౌత్ లో మార్కెట్ తక్కువ ఉంది. ఆ ఒక్క వేరియేషన్ తప్ప ఇంకేమీ లేవు. మరి ఈ పోటీలో ఎవరు విజేతగా నిలిచే అవకాశం ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఒక వేళ పోటీ కరెక్ట్ కాదని భావించి ఎవరైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News