సలార్.. అందుకే రిస్క్ తీసుకోవట్లే..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. రెండు భాగాలుగా సిద్ధమవుతోన్న ఈ సిరీస్ నుంచి పార్ట్ 1 సెప్టెంబర్ 28న నిజానికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో ప్రశాంత్ నీల్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ డేట్ ని వాయిదా వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే అఫీషియల్ గా మాత్రం చిత్ర యూనిట్ నుంచి మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ఎలాంటి క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ స్పందించలేదు. అలాగే ట్రైలర్ అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో పోస్ట్ పోన్ కావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనేదానిపై ఆలోచించారంట.
అయితే ఆ సమయంలో కాంపిటేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నార్త్ ఇండియాలో కలెక్షన్స్ పరంగా జనవరి గుడ్ సీజన్ కాదు. సౌత్ లో ఉన్నంత డిమాండ్ అప్పుడు అక్కడ ఉండదు. అందుకని ముందుగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. నవంబర్, డిసెంబర్ నెలల్లో డేట్స్ ని పరిశీలిస్తున్నారంట. ముఖ్యంగా దీపావళి, క్రిస్మస్ టైంలో అయితే బెటర్ అని అనుకుంటున్నారంట. అయితే దీపావళికి సల్మాన్ ఖాన్ టైగర్ 2 రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమాకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ సమయంలో సలార్ మూవీ రిలీజ్ చేస్తే టఫ్ ఫైట్ ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక క్రిస్మస్ టైంలో సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. సలార్ ఇప్పుడు రిలీజ్ కాకపోతే మాత్రం నెక్స్ట్ ఏ డేట్ లో వేసుకున్న గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ లు ఎక్కువ కనిపిస్తున్నాయి.
మరి ప్రశాంత్ నీల్ ఆలోచన సలార్ మూవీ రిలీజ్ విషయంలో ఎలా ఉందనేది వేచి చూడాలి. ఒక వేళ సలార్ రిలీజ్ లేట్ అయితే నెక్స్ట్ నాగ్ అశ్విన్ తో చేస్తోన్న కల్కి 2898 ఏడీ మూవీ కూడా మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.