'సలార్ 2' తర్వాత ప్రభాస్ చారిత్రక కథలో?
తాజాగా ఎన్‌ఐటీ వరంగల్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌కి హాజరైన హను రాఘవపూడి ప్రభాస్ తో తన సినిమాని అధికారికంగా ఖరారు చేసారు.
డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం 'కల్కి 2898 AD' షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ లోను ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సైమల్టేనియస్ గా ఈ రెండు సినిమాల చిత్రీకరణల్లో పాల్గొన్న ప్రభాస్ తదుపరి ప్రశాంత్ నీల్ సలార్ 2 లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణలో ప్రభాస్ చేరారని కూడా కథనాలొచ్చాయి. అదే సమయంలో ప్రేమకథా చిత్రాల దర్శకుడు డు హను రాఘవపూడితో హీరో ప్రభాస్ ఓ సినిమాకి కమిటైన సంగతి తెలిసిందే. అయితే హనుతో సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అన్నదానికి సరైన స్పష్ఠత రాలేదు.
తాజాగా ఎన్‌ఐటీ వరంగల్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌కి హాజరైన హను రాఘవపూడి ప్రభాస్ తో తన సినిమాని అధికారికంగా ఖరారు చేసారు. అంతేకాదు ఈ సినిమా చరిత్ర ఆధారంగా రూపొందే పీరియాడికల్-యాక్షన్ చిత్రమని వెల్లడించారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు ట్యూన్స్ ఇచ్చారని దర్శకుడు హను వెల్లడించారు. ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని తెలుస్తోంది.
'సలార్ 2' కోసం భారీ ఈత కొలను ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ 'సలార్-2' (శౌర్యంగ పర్వం) చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. ఓవైపు ఈ షెడ్యూల్ చిత్రీకరణ సాగుతుండగానే, తదుపరి యాక్షన్ షెడ్యూల్ కోసం భారీ స్విమ్మింగ్ పూల్ సెట్ ను వేస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఈత కొలనులో కృత్రిమ అలలను క్రియేట్ చేసేందుకు టెక్నికల్ టీమ్ వర్క్ చేయనుందిట. సముద్ర నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచేలా తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఏప్రిల్ లో పార్ట్-2ని ప్రారంభించి 2025లో రిలీజ్ చేస్తామని గతంలో హోంబలే అధినేత విజయ్ కిరంగదూర్ అన్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజులో ఈ సినిమాలో యాక్షన్ కంటెంట్ రంజింపజేస్తుందని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి.