ఈ బ్యూటీ అక్కడ ఎన్నాళ్లకెన్నాళ్లకు?
ప్రగ్యా జైశ్వాల్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'మిర్చి లాంటి కుర్రాడు' నుంచి 'సన్నాఫ్ ఇండియా' వరకూ పడతా లేస్తా సినిమాలు చేసింది
ప్రగ్యా జైశ్వాల్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'మిర్చి లాంటి కుర్రాడు' నుంచి 'సన్నాఫ్ ఇండియా' వరకూ పడతా లేస్తా సినిమాలు చేసింది. అంతకు ముందే కోలీవుడ్ లో ఎంట్రీ.. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ లాంచ్ అయింది. ఈ రెండు భాషలకంటే బెటర్ గా తెలుగు లోనే సినిమాలు చేసింది. ఇక్కడ కూడా కెరీర్ చరమాంకానికి చేరుకోవడం తో పాటు తమిళ్..హిందీ భాషల్లో కూడా అవకాశాలు రాకపోవడంతో ఇక పరిశ్రమ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందే అన్న విమర్శలు ఎదుర్కుంది.
కానీ ప్రగ్యా మాత్రం ప్రయత్నాలు ఏనాడు ఆపలేదు. అభిమానులకు నిరంతరం ఇన్ స్టా ద్వారా టచ్ లో నే ఉంది. హాట్ ఫోటోలతో అలరించే ప్రయత్నంలో కొంత వరకూ సక్సెస్ అయింది. అవకాశాలు లేవు అనే మాట తప్ప! అభిమానుల్లోనే ఉన్నాను అనే పాజిటివ్ సైన్ తో ముందుకెళ్లింది. అనుకున్నట్లుగానే తన తొమ్మిదేళ్ల క్రితం నాటి కల నిజమయ్యే మరో అవకాశం అందుకుంది.
అవును అమ్మడికి మళ్లీ బాలీవుడ్ నుంచి పిలిచి అవకాశం ఇచ్చింది. అక్షయ్ కుమార్ ..తాప్సీ ..వాణీ కపూర్ నటిస్తోన్న 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలో ప్రగ్యా అవకాశం అందుకుంది. ఇందులో అమ్మడు ఓ కీలక పాత్ర పోషిస్తుందిట. అక్షయ్ కుమార్ తో పోటా పోటీ సన్నివేశాలున్నాయట. ఈ చిత్రాన్ని ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇటాలియన్ సినిమా కి రీమేక్ గా రూపొందుతుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉదయ్ పూర్ లో జరుగుతుంది. త్వరలోనే ప్రగ్యాజైశ్వాల్ షూట్ లో జాయిన్ కానుందిట. ప్రగ్యా రెంవడ సినిమా బాలీవుడ్ లోనే చేసింది. అదే 'టిటూ ఎంబీఏ'. అందులో నిశాంత్ దాహియాకి జోడీగా నటించింది. అమిత్ వాత్స్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం సాధించలేదు. ఆ తర్వాత ప్రగ్యాకి హిందీలో మరో అవకాశం రావడానికి తొమ్మిదేళ్లు పట్టింది.