ప్ర‌గ్యా ఎర్ర బికినీ అవ‌కాశం ఇస్తుందా?

అయితే అనూహ్యంగా నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న అఖండ‌లో అవ‌కాశం అందుకున్న ఈ బ్యూటీ ఆ త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌నా ఓ భారీ చిత్రంలో ఛాన్స్ అందుకుంది.

Update: 2024-07-05 23:30 GMT

ముంబై బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఇన్‌స్టాగ్రామ్ స‌హా ఇత‌ర‌ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. ల‌క్ష‌లాదిగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే సినిమాల్లో కెరీర్ విషయానికి వస్తే అది దాదాపు ముగింపు దశకు వచ్చినట్లు కనిపిస్తోంది. కనీసం తెలుగులోనైనా ఈ భామ‌కు అవ‌కాశాల్లేవ్. ఏ తెలుగు సినిమా కోసం ఆమెను ఎవరూ పరిగణించడం లేదా సంప్రదించడం లేదు. నిజానికి క్రిష్ దర్శకత్వం వహించిన 2015 మూవీ `కంచె` మిన‌హా కెరీర్ లో ఆశించిన బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ కూడా లేవు. కంచె చిత్రంలో త‌న‌ నటనకు ప్రశంసలు అందుకుంది. అటుపై నాలుగు సంవత్సరాల పాటు కొన్ని ప్రాజెక్ట్‌ల్లో న‌టించింది. కానీ అవన్నీ ఫ్లాపులుగా మారాయి.

అయితే అనూహ్యంగా నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న అఖండ‌లో అవ‌కాశం అందుకున్న ఈ బ్యూటీ ఆ త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌నా ఓ భారీ చిత్రంలో ఛాన్స్ అందుకుంది. కానీ ఆ రెండు సినిమాలు త‌న‌కు ఎంత‌మాత్రం క‌లిసి రాలేదు. అయితే న‌టిగా కెరీర్ జీరో అయిపోయినా కానీ, ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాల్లో ఫాలోయింగ్ త‌గ్గ‌లేదు. ల‌క్ష‌ల్లో ఫ్యాన్స్ ఇప్ప‌టికీ ఈ భామ‌ను అనుస‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం పెద్ద స్టార్ల సరసన మాత్రమే సంతకం చేయడానికి వేచి ఉందని టాక్ వినిపిస్తోంది. కానీ అదృష్టం ఇంకా త‌న ఇంటి త‌లుపు త‌ట్ట‌లేదు. టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌లు కొత్త ముఖాల‌ను కోరుకుంటున్నాయి. అందువ‌ల్ల ప్ర‌గ్య ఔట్ డేటెడ్ గా మారిపోతోంది. ఇప్పుడు చాలా పోటీ ఉంది.. చాలా మంది కన్నడ, మలయాళ నటీమ

ణులు టాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నారు.. కాబట్టి ప్రగ్యా జైస్వాల్ వంటి నటీమణులకు కంబ్యాక్ చాలా కష్టం అని విశ్లేషిస్తున్నారు.

అయితే ప్ర‌గ్య జైశ్వాల్ త‌న‌ను తాను రీబూట్ చేసుకునేందుకు నిరంత‌రం బికినీలు, స్విమ్ సూట్ల‌తో వ‌రుస ఫోటోషూట్లు చేస్తూ వేడి పెంచే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా ప్ర‌గ్య షేర్ చేసిన రెడ్ హాట్ బికినీ షూట్ యువ‌త‌రంలో వైర‌ల్ గా మారుతోంది. స‌ముద్రంలో బోట్ లో షికార్ చేస్తున్న ప్ర‌గ్య ఎర్ర‌ని స్విమ్ సూట్ లో ఎంతో హాట్ గా క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. అయితే ఈ వైర‌ల్ వీడియోలు ప్ర‌గ్య ఫేట్ మారుస్తాయా? అన్న‌ది వేచి చూడాలి. ప్ర‌స్తుతం హిందీ చిత్రం `ఖేల్ ఖేల్ మే`లో ఇత‌ర భామ‌ల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం అందుకున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి.

Tags:    

Similar News