ధమాకా ఆడింది శ్రీలీల వల్ల కాదు: ప్రసన్న కుమార్ బెజవాడ
వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు ధమాకా సినిమా ఇచ్చిన బూస్టప్ అంతా ఇంతా కాదు.;

వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు ధమాకా సినిమా ఇచ్చిన బూస్టప్ అంతా ఇంతా కాదు. మొదటి రోజు మిక్డ్స్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమా తర్వాత్తర్వాత మెల్లిగా మంచి రన్ తో రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ధమాకా చాలా రెగ్యులర్ కథ. అయినప్పటికీ అందులోని కొన్ని అంశాలు సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి.
అందులో మెయిన్ రీజన్ శ్రీలీల డ్యాన్సులు, ఆమె ఎనర్జీ, సాంగ్స్ అని అందరూ అన్నారు. అయితే శ్రీలీల వల్ల మాత్రమే సినిమా ఆ రేంజ్ హిట్ అవలేదు. దానికి రవితేజ ఎనర్జీతో పాటూ మరికొన్ని అంశాలు కూడా దోహదపడ్డాయి. కానీ ధమాకా హిట్ మొత్తాన్ని శ్రీలీల అకౌంట్ లో వేసేసి ఆమె వల్లే సినిమా సూపర్ హిట్ గా నిలిచిందన్నారు.
ఈ విషయాన్ని రీసెంట్ గా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడను అడిగితే హీరోయిన్ గ్లామర్, డ్యాన్సుల వల్ల సినిమా ఆడేస్తుందా అని అతను రివర్స్ లో క్వశ్చన్ చేశాడు. ధమాకా తర్వాత కూడా శ్రీలీల చాలా సినిమాలు చేసింది, అందులో కూడా మంచి స్టెప్పులేసింది, చాలా అందంగా కనిపించింది. కానీ అవన్నీ హిట్టవలేదు కదా అని అడిగాడు.
ఏ సినిమా అయినా బాగా పెర్పార్మ్ చేసిందంటే దానికి కారణం కథేనని, సినిమా మొత్తం మీద సాంగ్స్ 20 నిమిషాలు కూడా ఉండవని, ఆ 20 నిమిషాలు ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ దొరికినంత మాత్రాన సినిమా ఆడదని, మిగిలిన రెండు గంటల పాటూ కూడా సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే ఆడియన్స్ సినిమాను ఆదరిస్తారని ప్రసన్న కుమార్ అన్నాడు.
సినిమా అంతా బావుండి దానికి సాంగ్స్, హీరోయిన్ గ్లామర్, డ్యాన్సులు యాడ్ అయితే సినిమాకు బోనస్ అవుతాయి తప్పించి కేవలం గ్లామర్, డ్యాన్సుల వల్ల సినిమాలు ఆడవని ఆయన చెప్పుకొచ్చాడు. ధమాకా మూవీలో కామెడీ బాగా వర్కవుట్ అవడం వల్లే సినిమా అంతపెద్ద బ్లాక్ బస్టర్ అయిందని ప్రసన్న కుమార్ బెజవాడ తెలిపాడు.