ఫోటో క్రెడిట్ లేదా పుష్పా అంటూ వచ్చేశాడు..!

ఐతే ఆ ట్వీట్ కు ప్రశాంత్ వర్మ రెస్పాండ్ అవుతూ ఫోటో క్రెడిట్ లేదా పుష్పా అంటూ కామెంట్ పెట్టాడు. దానికి తేజా సజ్జ వచ్చేశాడు అంటూ కృష్ణ సినిమాలో బ్రహ్మానందం జిఫ్ పెట్టాడు.

Update: 2024-12-01 09:45 GMT

హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హీరో తేజా సజ్జా ఇద్దరు ప్రొఫెషనల్ గానే కాదు పర్సనల్ గా కూడా మంచి ఫ్రెండ్స్. అందుకే వాళ్లిద్దరు కలిసి చేసిన ప్రాజెక్టులు రెండు ఒకటి జాంబి రెడ్డి రెండోది హనుమాన్ హిట్ అయ్యాయి. ఐతే ఆన్ స్క్రీన్ మీద వారి టాలెంట్ తో మెప్పించే వీరు ఆఫ్ స్క్రీన్ పై ఒకరి మీద ఒకరు వేసుకునే పంచులు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలా సరదాగా తేజా ఏదో పెట్టడం దానికి ప్రశాంత్ వర్మ కామెంట్ పెట్టడం దానికి తేజా రిప్లై ఇస్తే దానికి ప్రశాంత్ వర్మ కామెంట్ తిరిగి కామెంట్ పెట్టడం ఇలా జరుగుతుంది.

లేటెస్ట్ గా అలాంటి ఫన్నీ ట్వీట్ చాట్ జరిగింది. తేజా సజ్జా రణ్ వీర్ సింగ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఆయన తేజా గురించి చెప్పిన విషయాలను ప్రస్తావించాడు. రణ్ వీర్ లాంటి స్టార్ తనని పొగడటంతో తేజా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఐతే ఆ ట్వీట్ కు ప్రశాంత్ వర్మ రెస్పాండ్ అవుతూ ఫోటో క్రెడిట్ లేదా పుష్పా అంటూ కామెంట్ పెట్టాడు. దానికి తేజా సజ్జ వచ్చేశాడు అంటూ కృష్ణ సినిమాలో బ్రహ్మానందం జిఫ్ పెట్టాడు.

ఐతే దానికి కూడా ప్రశాంత్ వర్మ స్పందిస్తూ మనకు ఏం కావాలన్నా సరే అడిగి తీసుకోవాలని ఒక పెద్దాయన చెప్పాడంటూ కామెంట్ పెట్టాడు. ఈ సరదా సంభాషణలు నెటిజన్లను అలరించింది. ఈమధ్యనే పుష్ప 2 చెన్నై ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్ మనకు ఏం కావాలనా సరే అడిగి తీసుకోవాలని చెప్పాడు. ఆయన చెప్పిన సందర్భం ఏమో కానీ తేజా గురించి ప్రశాంత్ వర్మ పెట్టింది మాత్రం ఫన్నీగా ఉంది.

ఇక ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. జై హనుమాన్ చేస్తూనే మహాకాళి, అధీరా చేస్తున్నాడు. అంతేకాదు నందమూరి వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం సినిమాను కూడా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. హనుమాన్ తో పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటిన ప్రశాంత్ వర్మ రాబోయే సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకునేలా ఉన్నాడు. తేజ్జా సినిమాల విషయానికి వస్తే జై హనుమాన్ లో చిన్న పార్ట్ అయ్యే ఛాన్స్ ఉండగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో మిరాయ్ సినిమాతో భారీ స్కెచ్ వేశాడు. ఈ సినిమా గ్లింప్స్ తోనే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది.

Tags:    

Similar News