మోక్షు ఎంట్రీకి అంతా ఫిక్సా? వర్మ ట్వీట్ మీనింగ్ అదేనా?

అదే సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా పోస్ట్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-09-03 10:45 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా మోక్షు ఎంట్రీకి రంగం సిద్ధమైందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంకా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. కొద్ది రోజులుగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మూవీతోనే మోక్షు బాబు.. డెబ్యూ మూవీ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా గ్రౌండ్ వర్క్ జరుగుతుందని, త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఓ ఇంటర్వ్యూలో ఇటీవల బాలయ్య చెప్పిన వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అంతకుముందు తన సినీ అరంగేట్ర స్వర్ణోత్సవం సందర్భంగా ఓ మీడియాతో చిట్ చాట్ సమయంలో మోక్షు డెబ్యూ మూవీకి తన చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా వ్యవహరించనుందని తెలిపారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అదే సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా పోస్ట్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపిస్తున్న పిక్ ను మంగళవారం షేర్ చేశారు. నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుందంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చారు. అంతే కాదు.. సింబా ఈజ్ కమింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. అంతకుముందు.. ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నా అంటూ మరో ఫోటోను షేర్ చేశారు ప్రశాంత్ వర్మ.

దీంతో మోక్షు ఎంట్రీను ఉద్దేశించే ప్రశాంత్ వర్మ పోస్టులు పెట్టారని నందమూరి అభిమానులు చెబుతున్నారు. అయితే లేటెస్ట్ పోస్ట్ లో PVCU అని ఆయన మెన్షన్ చేశారు. హనుమాన్ కన్నా ముందు.. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌-PVCU నుంచి వరుస సినిమాలు వస్తాయని ఆయన చెప్పారు. దీంతో మోక్షజ్ఞ మూవీ కూడా PVCUలో భాగమేనని నెటిజన్లు అంటున్నారు. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని చెబుతున్నారు.

అయితే ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే మోక్షు.. ఇప్పుడు లుక్స్ పరంగా పెర్ఫెక్ట్ హీరోగా తయారైనట్లు కనిపిస్తున్నారు. ఇటీవల ఫోటో షూట్ లో భాగంగా దిగిన పిక్స్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, హనుమాన్ మూవీతో తన సత్తా ఏంటో చూపించారు ప్రశాంత్ వర్మ. పాన్ ఇండియా లెవెల్ లో ప్రశంసలు అందుకున్నారు. మరి ఇప్పుడు మోక్షజ్ఞ కోసం ఆయన ఎలాంటి స్క్రిప్ట్ రాసుకున్నారో వేచి చూడాలి.

Tags:    

Similar News