ప్రశాంత్ వర్మ మిస్టరీ కామెంట్.. అతనిపైనేనా?

హనుమాన్ సినిమాతో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే

Update: 2024-07-09 04:46 GMT

హనుమాన్ సినిమాతో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. అప్పటివరకు తెలుగులో పలు సినిమాలు చేసిన ఆయన.. హనుమాన్ తో ఓవర్ నైట్ డైరెక్టర్ గా మారిపోయారు. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోయింది. సినీ ప్రియులతో పాటు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. దీంతో ఆయన కొత్త చిత్రాలపై అందరి దృష్టి నెలకొంది.

హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను ప్రకటించారు ప్రశాంత్ వర్మ. అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ మధ్య ఓ స్పెషల్ ప్లేస్ ను పరిచయం చేశారు. అయితే జై హనుమాన్ కన్నా ముందు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో సినిమా తీసేందుకు ప్రశాంత్ వర్మ సిద్ధమయ్యారు. ఆ ప్రాజెక్టుకు రాక్షస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు, టెస్ట్ షూట్ కూడా జరిగినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపించింది.

అంతా బాగానే ఉందనుకున్న టైమ్ లో.. ఆ సినిమా ఆగిపోయింది. రణవీర్, ప్రశాంత్ వర్మ, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సంయుక్త ప్రకటన వచ్చింది. తాను, ప్రశాంత్ వర్మ సినిమా చేయాలనుకున్నామని, భవిష్యత్తులో తామిద్దరం కలిసి వర్క్ చేస్తామని రణవీర్ తెలిపారు. అనుకున్న ప్రాజెక్టును ఇప్పుడు తీయడం కరెక్ట్ కాదని ప్రశాంత్ వర్మ తెలిపారు. దీంతో రాక్షస్ మూవీ ఆగిపోవడంతో.. జై హనుమాన్ మూవీపై ఆయన కంప్లీట్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో రీసెంట్ గా ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ పెట్టారు. 'ప్రతి తిరస్కరణ కూడా ఏదో ఒకరోజు తిరిగి ఆశీర్వాదం అవుతుంది' అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆయన పోస్ట్ వైరల్ గా మారగా.. నెటిజన్లు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. రాక్షస్ మూవీ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో రణవీర్ సింగ్ ను ఉద్దేశించి ప్రశాంత్ వర్మ అలా ట్వీట్ పెట్టి ఉంటారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఇంకొందరు వేరే అర్థం ఉందని అంటున్నారు.

అయితే తన రాక్షస్ స్టోరీకి వేరే హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని, అందుకే రణవీర్ కు కౌంటర్ గా ప్రశాంత్ వర్మ పోస్ట్ పెట్టారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. లేకుంటే పూర్తిగా రాక్షస్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి.. అప్ కమింగ్ సినిమాలపై దృష్టి పెట్టే క్రమంలో అలా ట్వీట్ చేశారేమోనని డౌట్ పడుతున్నారు. మొత్తానికి ప్రశాంత్ వర్మ ట్వీట్ కోసం జోరుగా చర్చ సాగుతోంది. మరి అసలు విషయం ఏంటో, ఏం జరిగిందో ఆయనకే తెలియాలి.

Tags:    

Similar News