నీల్ విధ్వంసానికి తారక్ తోడైతే..?

ఐతే ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనే ఛాన్స్ లేదని తెలుస్తుంది. నీల్ కేవలం మిగతా కాస్ట్ తోనే ఈ సినిమా షూటింగ్ జరుపుతారని తెలుస్తుంది.

Update: 2024-09-20 05:44 GMT

K.G.F, సలార్ సినిమాలతో తన మాస్ స్టామినా డైరెక్షన్ తో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైన ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్నాడని తెలిసిందే. ఈమధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుందని తెలుస్తుంది. అక్టోబర్ 21 నుంచి ప్రశాంత్ నీల్, తారక్ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. ఐతే ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనే ఛాన్స్ లేదని తెలుస్తుంది. నీల్ కేవలం మిగతా కాస్ట్ తోనే ఈ సినిమా షూటింగ్ జరుపుతారని తెలుస్తుంది.

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఈ కాంబో కోసం కొన్నాళ్లుగా ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే లేట్ అయినా సరే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మాస్ స్టామినాకు తగిన కథతోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఇంకా హై రేంజ్ ఎలివేషన్స్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా తర్వాత వార్ 2 కోసం కూడా ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చి ఉన్నాడు. అందుకే నీల్ సినిమాకు తారక్ జనవరి నుంచి తన డేట్స్ ఇస్తున్నాడని తెలుస్తుంది. అంటే అక్టోబర్ లో సినిమా మొదలైతే ఎన్టీఆర్ లేని సీన్స్ ను ప్రశాంత్ నీల్ పూర్తి చేస్తే జనవరి నుంచి తారక్ తన పార్ట్ మొదలు పెడతారని తెలుస్తుంది. ఇందుకు తగినట్టుగానే షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. నీల్, తారక్ ఈ ఇద్దరు ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ 31 సినిమా స్క్రిప్ట్ ఫైనల్ కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తైంది. నీల్ అక్టోబర్ ఎండింగ్ నుంచి రెండు నెలల్లో సినిమాకు సంబందించిన మిగతా పార్ట్ అంతా పూర్తి చేస్తే జనవరి నుంచి ఎన్ టీ ఆర్ రంగంలోకి దిగి మిగతా సినిమా కొనసాగిస్తాడు. నీల్ విధ్వంసానికి ఎన్టీఆర్ తోడైతే ఆ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ సినిమాతో తెలుస్తుంది. సినిమా అనుకున్న విధంగా షూటింగ్ జరిగితే 2026 సమ్మర్ రిలీజ్ ఉంటుందని టాక్.

Tags:    

Similar News