ప్రశాంత్ నీల్.. శంకర్ లాగా ట్విస్ట్ ఇవ్వడుగా..?
హీరో-దర్శకుల కాంబినేషన్ అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
హీరో-దర్శకుల కాంబినేషన్ అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరైన కాంబినేషన్ సెట్ అయితే, సినిమా మొదలవకముందే మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా మార్కెట్లో మరింత ఎక్కువ కాంబినేషన్లు తెరపైకి రాబోతున్నాయి. ఇందులో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు.
ఈ ఇద్దరు కూడా ఎప్పటినుంచో సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నారు. అయితే, సరైన డేట్స్ కుదరకపోవడం వల్ల మరియు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఇప్పటివరకు సినిమా స్టార్ట్ కాలేదు. ఇక మొత్తానికి, రీసెంట్‌గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ మొదలవబోతోంది అని అధికారికంగా పోస్టర్ కూడా విడుదల చేశారు. అంతా బాగానే ఉంది కానీ, సలార్ సెకండ్ పార్ట్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
అసలు, ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లోనే మొదలవుతుందని చాలామంది నటీనటులు కూడా చెప్పారు. మొదటి పార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న నేపథ్యంలో సెకండ్ పార్ట్ శౌర్యంగపర్వం పై ప్రేక్షకులు అధిక స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి, వీలైనంత తొందరగా ఈ పాజిటివ్ హైప్ ఉన్నప్పుడే సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వస్తున్నాయి.
అయితే, దర్శకుడు ప్రశాంత్ ఇప్పుడు హఠాత్తుగా ఎన్టీఆర్ సినిమాను లైన్‌లోకి తీసుకువచ్చారు. దీంతో, ప్రభాస్ సినిమా 'సలార్'పై అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ 'సలార్ 2' సెట్స్ పైకి తీసుకురావస్తే, మరోవైపు ఎన్టీఆర్ సినిమాను కూడా ఒకేసారి కొనసాగిస్తారా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. 'సలార్ 2'పై మేకర్స్ ఇప్పట్లో క్లారిటీ ఇవ్వరని తెలుస్తోంది.
ప్రభాస్ కూడా మరోవైపు 'రాజాసాబ్' సినిమాలో ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు 'కల్కి' ప్రమోషన్స్‌తో మరింత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో 'సలార్' డేట్స్ అడ్జెస్ట్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ ప్రభాస్ గ్యాప్ ఉన్నప్పుడు 'సలార్ 2' షూటింగ్ కొనసాగిస్తారు అనే విధంగా కూడా మరికొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా, ఇద్దరు పెద్ద హీరోలతో ఇంతటి భారీ బడ్జెట్ సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకురావడం చాలా రిస్కుతో కూడుకున్న పని. ఇప్పటికే దర్శకుడు శంకర్ ఆ బాధను అనుభవిస్తున్నారు. కొన్ని పొరపాట్లతో 'భారతీయుడు 2' గేమ్ ఛేంజర్ సినిమాల షూటింగ్స్‌ను ఒకేసారి పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఏ సినిమాపై సరైన క్లారిటీ కూడా రాకపోవడం తో, ఆయన ఒత్తిడికి గురి అవుతున్నారు. మరి అదే తరహాలో ఎన్టీఆర్, సలార్ ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకువచ్చి ప్రశాంత్ నీల్ కూడా రిస్కు తీసుకుంటాడా లేదా అనేది డౌట్స్ వస్తున్నాయి. లేదంటే సైలెంట్ గా ప్రభాస్ ప్రాజెక్టును పక్కనపెడతారేమో చూడాలి.