బెంజ్ నుంచి రేంజ్ రోవర్ కి అతడు!
ఒక్కఛాన్స్ అంటూ ఎందుకు అవకాశాల కోసం అంతగా తాపత్రయ పడతారో? అలాంటి అనుభవం ఎదుర్కున్న వాళ్లకే తెలుస్తుంది
ఒక్కఛాన్స్ అంటూ ఎందుకు అవకాశాల కోసం అంతగా తాపత్రయ పడతారో? అలాంటి అనుభవం ఎదుర్కున్న వాళ్లకే తెలుస్తుంది. అందులో కష్ట సుఖాలు వాళ్లకే తెలుసు. ముందుగా సినిమా అంటే ప్రాణమించ్చేంత పిచ్చి. అందులో సక్సెస్ అయితే రేంజ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఎంతో మంది స్టార్లను ఉదహరించవచ్చు. గంజి నుంచి బెంజ్ కి చేరుకున్న వాళ్లు ఎంతో మంది. ఇండస్ట్రీలో సక్సెస్ అయింది..లాంగ్ రన్ లో నిలబడింది కూడా అలాంటి వారే.
కష్టం విలువ తెలిసిన వారికే ఆ సక్సెస్ ని ఎలా నిలబెట్టుకోవాలన్నది తెలుస్తోంది. తాజాగా 'హనుమాన్' విజయంతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియాలో ఎంత ఫేమస్ అవుతున్నాడో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు అతడితో కోటి రూపాయలు పెట్టి సినిమా తీయడానికి ఆలోచించిన నిర్మాతలు ఇప్పుడు వందల కోట్ల పెట్టు బడితో ముందుకొస్తున్నారు. టాలీవుడ్ నుంచే కాదు బాలీవుడ్ ఇతర భాషల నుంచి ప్రశాంత్ వర్మకి పెద్ద పెద్ద అవకాశాలే వస్తున్నాయి.
40 కోట్ల తో 250 కోట్లకు పైగా వసూళ్లు తెచ్చే సినిమా తీసనప్పుడు రావా? ఏంటి మరి! ఇప్పుడెవరైనా ..ఎంతటి వారైనా దిగిరావాల్సిందే. ప్రస్తుతం ఆ సక్సెస్ ని ..ఆమూవ్ మెంట్స్ ని ప్రశాంత్ ఆస్వాదిస్తు న్నాడు. పనిలో పనిగా బెంజ్ నుంచి రేంజ్ రోవర్ కి మారుతున్నట్లు తెలుస్తుంది. ఇంత కాలం బెంజ్ కారు వాడిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు 6 కోట్ల ఖరీదుగల రేంజ్ రోవర్ కారుని బుక్ చేసినట్లు సమాచారం.
ఇప్పుడా కారు తన ఇంటి గుమ్మం ముందు ఎప్పుడు ఎంటుందా? అని ఎదురు చూస్తున్నాడు.ఆ కారు చేరిన తర్వాత ఇండస్ట్రీలో అదే కారులో ఇకపై తిరుగుతాడు. అది చూసి మిగతా వాళ్లు చూసారా? బెంజ్ నుంచి రోవర్ రేంజ్ వరకూ ఎలా మారాడో? అనుకోవడం ఖాయం. 250 కోట్లు తె చ్చిన సినిమాలో కొంత పెట్టుబడి కూడా తనది ఉండే అవకాశం ఉంది. కాబట్టి పారితోషికంతో పాటు భారీగా లాభాల్లో వాటా తీసుకునే అవకాశం కూడా ఉంది.