సంక్రాంతి పోటీ.. ప్రశాంత్ వర్మ లాజిక్ ఏంటంటే..

కానీ సంక్రాంతి సినిమాల్లో 'హనుమాన్' వెనక్కి తగ్గాలనే ఉద్దేశంతో జరిగిన ప్రచారాల పట్ల దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజా ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు.

Update: 2024-01-02 07:32 GMT

ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 5 సినిమాలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో స్టార్ హీరోల సినిమాలు తో పాటు సీనియర్ హీరోల సినిమాలు ఓ యంగ్ హీరో సినిమా కూడా ఉంది. అయితే వీటిలో హనుమాన్ మేకర్స్ సంక్రాంతి రిలీజ్ డేట్ ను అందరికంటే ముందు ప్రకటించారు. కానీ సంక్రాంతి సినిమాల్లో 'హనుమాన్' వెనక్కి తగ్గాలనే ఉద్దేశంతో జరిగిన ప్రచారాల పట్ల దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజా ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు.

నిజానికి ఆరు నెలల ముందే హనుమాన్ సినిమా జనవరి 12 డేట్ ని ఫిక్స్ చేసుకుంది. దానికంటే ముందు మే లో రిలీజ్ అనుకున్నారు. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో ఆ తర్వాత బెస్ట్ ఆప్షన్ గా సంక్రాంతి పండగ కనిపించడంతో డేట్ లాక్ చేసుకున్నారు. అంతేగాని సంక్రాంతికే రావాలని కాదు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న హనుమాన్ కేవలం తెలుగు వర్షన్ మాత్రమే కాక మరో 9 భాషల్లో డబ్ అవుతోంది.

వీటికి సంబంధించిన బిజినెస్ లావాదేవీలు ఎప్పుడో పూర్తయ్యాయి. నార్త్ ప్రమోషన్స్ కోసం అక్కడి హక్కుదారలు ఇప్పటికే ఐదు కోట్లు ఖర్చు పెట్టేశారు. అందులో భాగంగానే పోస్టర్లు, స్టాండీలు దేశమంతా వెళ్ళిపోయాయి. ఆ తర్వాత టీజర్, ట్రైలర్ వచ్చాక ఆడియన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. దీంతో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. సినిమాకి ఒక్కరి పెట్టుబడి మాత్రమే ఉంటే డెసిషన్ మార్చుకోవచ్చు. కానీ హనుమాన్ విషయంలో అది సాధ్యపడదు.

దిల్ రాజు ఇచ్చిన సూచనలు కూడా తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ పంచుకున్నారు. జనవరి 19, ఆపై రిపబ్లిక్ డే తర్వాత ఫిబ్రవరి మొదటి భాగం ఇలా ఏ డేట్ కు వెళ్లినా ఇప్పుడు వచ్చే దానికన్నా ఎక్కువ రెవెన్యూ వస్తుందని ఆయన సలహా ఇచ్చారట. కానీ ఇది ఇగో తోనో, పంతంతోనో తీసుకున్న డెసిషన్ కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయలేని నిస్సహాయత మిగిలింది.

పైగా సంక్రాంతికి కనీసం మూడు సినిమాలు బాగా ఆడుతాయని ప్రతి ఏడాది నిరూపితం అవుతూనే ఉంది. కాబట్టి హనుమాన్ వెనక్కి వెళ్లే ఆప్షన్ లేదని ప్రశాంత్ వర్మ చెప్పడంలో లాజిక్ ఉంది. ఫైనల్ గా సంక్రాంతి బరిలో ఐదు సినిమాల మధ్య రసవత్తరమైన పోటీ జరగబోతుంది. మరి ఈ పోటీలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

Tags:    

Similar News