PCUలో మరో మైథాలజీ క్యారెక్టర్

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో సూపర్ హీరో చిత్రాల సిరీస్ ని స్టార్ట్ చేశాడు.

Update: 2024-07-03 10:51 GMT

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో సూపర్ హీరో చిత్రాల సిరీస్ ని స్టార్ట్ చేశాడు. ఇండియన్ మైథాలజీలో ఉన్న పవర్ ఫుల్ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని సూపర్ హీరో మూవీస్ ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చేస్తానని చెప్పారు. మొత్తం 10 సినిమాలు ఇందులో వస్తాయని గతంలో ప్రకటించారు. అందులో మొదటి చిత్రంగా హనుమాన్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

హనుమాన్ తర్వాత జై హనుమాన్ సినిమాని చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేసి మళ్ళీ హోల్డ్ లో పెట్టారు. రణవీర్ సింగ్ తో ఒక సూపర్ హీరో మూవీ కూడా కన్ఫర్మ్ అయ్యింది. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ రద్దయ్యింది. దీంతో ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. రవితేజతో ఒక సూపర్ హీరో కామిక్ మూవీ ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ బయటకొచ్చింది. దీనిపై అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు.

ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాలో చిరంజీవులైన హనుమాన్, విభీషణుడి పాత్రలని ప్రశాంత్ వర్మ ప్రెజెంట్ చేశాడు. కల్కి సినిమాలో అశ్వద్ధామ పాత్ర ఉంది. సప్త చిరంజీవులలో ఇతను కూడా ఒకడు. ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు. ప్రశాంత్ వర్మ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకి ప్రశాంత్ వర్మ సమాధానాలు ఇచ్చారు.

మీ సినిమాటిక్ యూనివర్స్ లో అశ్వద్ధామ క్యారెక్టర్ కూడా ఉంటుందా అని ప్రశాంత్ వర్మని అభిమాని అడిగారు. మీరు ఊహించిన అన్ని పాత్రలు కచ్చితంగా ఉంటాయని ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ సమాధానం ఇచ్చారు. అంటే సప్త చిరంజీవులుగా ఉన్న అందరూ కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కనిపిస్తారని అర్ధమవుతోంది. అయితే ఆ పాత్రలని ప్రశాంత్ వర్మ ఎలా చూపిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more!

ఏది ఏమైనా మైథాలజీ ఉన్న పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ని మరల సూపర్ హీరో కథల ద్వారా మన దర్శకులు ప్రజలకి పరిచయం చేస్తూ ఉండటం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. తద్వార మన చరిత్ర, ఇతిహాసాల గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. అలాగే ఇంతవరకు సూపర్ హీరో సినిమాలంటే హాలీవుడ్ వైపు చూసేవారు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్స్ వీలైనన్ని సూపర్ హీరో సినిమాలని ఫ్రాంచైజ్ లుగా తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

Tags:    

Similar News

eac