ప్రతినిధి-2 రిలీజ్ ట్రైలర్..ఇది పొలిటికల్ యాక్షన్ గేమ్!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్.. కాస్త గ్యాప్ తర్వాత ప్రతినిధి-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్.. కాస్త గ్యాప్ తర్వాత ప్రతినిధి-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పదేళ్ల క్రితం వచ్చిన ప్రతినిధి మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మే 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా.. రీసెంట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసుకుంది.
సెన్సార్ బోర్డు అధికారుల నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. ఇక మరో రెండు రోజుల్లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. వాటిలో డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అంతగా నారా రోహిత్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా మరో గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్.
ఇప్పటికే మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వగా.. రీసెంట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. 'నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. సీఎంను ఎందుకు చంపాలనుకున్నావ్?' అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో గ్లింప్స్ మొదలైంది. ఆ తర్వాత జర్నలిస్ట్ నారా రోహిత్ తో.. సినిమాలోని పొలిటికల్ లీడర్ సీఎంను చంపడమంటే మాకే నష్టం, సింపతీ వాళ్లకే వర్కౌట్ అయిద్ది, ఆ మాత్రం తెలియదా? అనే ప్రశ్న గ్లింప్స్ ను మరింత ఆసక్తిగా మార్చింది.
ఇక గ్లింప్స్ లో చిన్నపాటి ఫైట్ సీన్ ను కూడా యాడ్ చేశారు మేకర్స్. 'పవర్ మన చేతిలో ఉంటే.. కేసులన్నీ కోర్టులో ఉంటాయి' అనే డైలాగ్ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను ఎత్తి చూపేలా ఉంది. 'దేశానికి కాపాడడానికి సైనికుడు, కడుపు నింపడానికి రైతు, సొసైటీకి జర్నలిస్ట్ అవసరం సర్' అంటూ నారా రోహిత్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మహతి స్వర సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవల్ లో ఉందని చెప్పవచ్చు.
మొత్తానికి ఈ మూవీతో నారా రోహిత్ హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది. తన యాక్టింగ్ తో అని వర్గాల ఆడియన్స్ ను అలరించనున్నట్లు, సినిమాలో మంచి పొలిటికల్ యాక్షన్ గేమ్ ఉన్నట్లు అర్థమవుతోంది. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సిరి లెల్లా ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.