చిరంజీవి దేవుడు..ఆయన డబ్బే తింటున్నాను!
30 ఏళ్ల గా ప్రేమ్ కుమార్ చిరంజీవి డూప్ గా అలరిస్తున్నారు. ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డాన్స్ పేరటి ఓ ట్రూప్ నిర్వహిస్తున్నారు.
డూప్ హీరోలంటే క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. చిరంజీవి..నాగార్జున..బాలకృష్ణ..వెంకటేష్ లాంటి హీరోలకు డూప్ లు ఎక్కువగా కనిపించేవారు. స్టేజ్ షోలో ఆ స్టార్ హీరోల ఆహార్యాల్లో అదరగొట్టే వారు. ఆ హీరోలకు అచ్చంగా అచ్చుగుద్దినట్లే ఉండేవారు. హిట్ సాంగ్స్ లోనూ..సన్నివేశాల్లోనూ పెర్పార్మెన్స్ చేసి ఆకట్టుకునేవారు. అలా చిరంజీవికి డూప్ బాగా ఫేమస్ అయిన వ్యక్తి ప్రేమ్ కుమార్. 30 ఏళ్ల గా ప్రేమ్ కుమార్ చిరంజీవి డూప్ గా అలరిస్తున్నారు. ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డాన్స్ పేరటి ఓ ట్రూప్ నిర్వహిస్తున్నారు.
వాస్తవానికి ప్రేమ్ కుమార్ చిరంజీవి అభిమాని కాదు. అక్కినేని నాగేశ్వరరావు అభిమాని. ప్రేమ్ కుమార్ ప్రస్తానం కూడా స్టేజ్ నుంచే ప్రారంభమైంది. తొలుత అక్కినేని నాగేశ్వరరావు ఆహార్యంలో మెప్పించే వాడు. ఇది రెగ్యులర్ వేషం కావడంతో స్నేహితులు అతనిలో చిరంజీవి ఫీచర్స్ ఉండటంతో చిరు లా కూడా డూప్ చేయోచ్చు కదా? అని ప్రోత్సహించారు. దీంతో ప్రేమ్ కుమార్ జీవితమే మారిపోయింది. మెగాస్టార్ పాటలకు డాన్సు చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి పెద్ద అభిమానిగా మారిపోయారు.
తొలిసారి "ఇందువదన" పాటకు డాన్స్ చేసాడు. ఆరేళ్ల వయసు నుంచి డాన్సులు చేయడం ప్రారంభించాడు. అలాగని చదువు అశ్రద్ద చేయలేదు. 1990 లో డిగ్రీ పాస్ అయ్యాక సినిమాలో అవకాశం వచ్చిందిట. అది చిరంజీవి "ఛాలెంజ్" సినిమా. ఆ తర్వాత "రాక్షసుడు".."మరణ మృదంగం" సినిమాల్లో డూప్ గా నటించడం మరింత ఫేమస్ అయ్యాడు. అయితే కొన్నాళ్ల తర్వాత సినిమా ఛాన్సులు రాలేదు.
దీంతో స్టేజ్ షోలతో బిజీ అయ్యాడు. అదే సమయంలో ప్రేమ్ కుమార్ కి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చిందిట. అప్పటికే అతని ఆదాయం వేలల్లో ఉండేదట. దీంతో టీచర్ ఉద్యోగం దేనికని తండ్రితో అన్నారుట. వయసులో ఉన్నప్పుడు నటిస్తావ్? ముసలవాడివి అయితే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించే సరికి తండ్రి మాటకి కట్టుబడి టీచర్ ఉద్యోగంలో చేరాడుట. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాన్ని డూప్ గా వినియోగించుకుంటున్నట్లు తెలిపాడు. చిరంజీవి తన దృష్టిలో దేవుడని..తన డబ్బులే తాను తింట్లునట్లు భావోద్వేగానికి గురయ్యాడు.