సూపర్‌ స్టార్‌తో సినిమా చేతిలోకి వచ్చి జారింది..!

మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈమధ్య కాలంలో వరుసగా సినిమాల్లో నటించడంతో పాటు దర్శకుడిగానూ సినిమాలను రూపొందిస్తున్నాడు.

Update: 2025-01-27 11:30 GMT

మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈమధ్య కాలంలో వరుసగా సినిమాల్లో నటించడంతో పాటు దర్శకుడిగానూ సినిమాలను రూపొందిస్తున్నాడు. సలార్‌ సినిమాలో కీలక పాత్రలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయిన ఈ నటుడు తెలుగులో భవిష్యత్తులో డైరెక్ట్‌ సినిమాలు చేస్తానంటూ హామీ ఇచ్చారు. నటుడిగా పృథ్వీరాజ్‌ సుకుమార్‌ను ఎంతగానో ఇష్టపడే ప్రేక్షకులు దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలను అదే స్థాయిలో ఇష్టపడే ప్రేక్షకులు ఉంటారు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌తో పృథ్వీరాజ్ చేసిన సినిమా లూసీఫర్‌ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

లూసీఫర్ సినిమాకు సీక్వెల్‌గా 'ఎల్‌ 2 : ఎంపురాన్‌' అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్‌ రూపొందించారు. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సీక్వెల్‌ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. మొదటి పార్ట్‌లో కీలక పాత్రలో నటించిన మోహన్‌ లాల్‌ సీక్వెల్‌లోనూ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అదే సమయంలో రజనీకాంత్‌తో సినిమా గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పృథ్వీరాజ్ మాట్లాడుతూ... కొన్నాళ్ల క్రితం లైకా ప్రొడక్షన్స్‌ వారు రజనీకాంత్‌ గారితో సినిమా కోసం నన్ను సంప్రదించారు. రజనీకాంత్‌ సర్‌తో సినిమా చేస్తున్న సమయంలో మరే హీరోతో సినిమా చేయవద్దని కండీషన్ పెట్టారు. అందుకు ఓకే చెప్పి కథ రెడీ చేసేందుకు వర్క్ స్టార్ట్‌ చేశాను. కానీ వారు ఇచ్చిన సమయంకు నేను కథను రెడీ చేయలేక పోయాను. రజనీకాంత్‌ గారి స్టార్‌డంకి తగ్గ కథను రెడీ చేయాలంటే ఎక్కువ సమయం కావాలి. అయితే కొన్ని కారణాల వల్ల కథ కూడా పూర్తిగా రెడీ కాకుండానే సినిమా క్యాన్సల్‌ అయ్యిందని, అలా రజనీకాంత్‌ గారితో సినిమా చేసే అవకాశం చేజారిందని పృథ్వీరాజ్ సుకుమార్‌ చెప్పుకొచ్చారు.

రజనీకాంత్‌ గారితో కచ్చితంగా భవిష్యత్తులో సినిమాను చేస్తానంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చేస్తున్న లూసీఫర్‌ 2 సినిమా సీక్వెల్‌ హిట్‌ అయితే కచ్చితంగా రజనీకాంత్‌ నుంచి మరోసారి పృథ్వీరాజ్ సుకుమారన్‌కి పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రజనీకాంత్‌ 'కూలీ' చివరి దశ పనిలో బిజీగా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమా తర్వాత జైలర్‌ సినిమాకు సీక్వెల్‌ చేయబోతున్నారు. నెల్సన్ దిలీప్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న జైలర్‌ 2 సినిమా టీజర్‌ వచ్చి ఆకట్టుకుంది. మరోసారి రజనీకాంత్‌కి బ్లాక్‌ బస్టర్ విజయాన్ని నెల్స్‌ దిలీజ్ జైలర్‌ 2తో ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూలీ, జైలర్‌ 2 సినిమాలు రాబోయే ఏడాది కాలం పాటు సూపర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News