పెళ్లైనా..త‌ల్లైనా అదే బ్యూటీ..అదే దూకుడు!

ఒక‌ప్పుడు హీరోయిన్ల‌కు సెకెండ్ ఇన్నింగ్స్ అంగే ఎంతో పేల‌వంగా ఉండేది. హీరోయిన్ అవ‌కాశాలు రావ‌డం అన్న‌ది దాదాపు శూన్యంగానే ఉండేది.

Update: 2024-03-13 14:30 GMT

ఒక‌ప్పుడు హీరోయిన్ల‌కు సెకెండ్ ఇన్నింగ్స్ అంగే ఎంతో పేల‌వంగా ఉండేది. హీరోయిన్ అవ‌కాశాలు రావ‌డం అన్న‌ది దాదాపు శూన్యంగానే ఉండేది. పెళ్లైన హీరోయిన్ సినిమాలు ఏం చేస్తుందులే అని అవ‌కాశాలివ్వ డానికి ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు ముందుకొచ్చేవారు కాదు. కానీ ఇప్పుడా ప‌ద్ద‌తి పూర్తిగా మారింది. పెళ్లికాని భామ‌ల‌కంటే పెళ్లైన భామ‌ల‌కే మార్కెట్ లోఎక్కువ‌గా డిమాండ్ క‌నిపిస్తుంది. పెళ్లైనా..త‌ల్లు లైనా....మాకే అవేం కాలేదు అన్న‌ట్లే భామ మ‌ణులంతా ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తున్నారు.


వాళ్ల‌కే అవ‌కాశాలివ్వ‌డానికి కూడా ద‌ర్శ‌కులు ముందుకొస్తున్నారు. పెళ్లైన త‌ర్వాత స‌మంత రేంజ్ రెట్టింపు అయిన సంగ‌తి తెలిలిసిందే. అలాగే కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా ఓ బిడ్డ‌కు త‌ల్లైనా అదే ఛ‌రిష్మాతో దూసుకు పోతుంది. అప్పుడ‌ప్పుడు భ‌ర్త‌ను వెంటేసి కొచ్చి మ‌రీ అవ‌కాశాలు అందుకుంటుంది. ఇక బ్యూటీ ప‌రంగా చూస్తే! పెళ్లైన త‌ర్వాత అమ్మ‌డి అందం రెట్టింపు అయిపోయింది. ఇక సూర్యికి వైఫ్ గా కుటుంబాన్ని చూసుకుంటూనే జ్యోతిక సెకెండ్ ఇన్నింగ్స్ ని ఏ రేంజ్ లో ప‌రుగులు పెట్టిస్తుందో ? చూస్తూనే ఉన్నాం.

లేడీ ఓరియేంటెడ్ సినిమాల‌తో స‌త్తా చాటుతుంది. ఇటీవ‌లే మ‌ళ్లీ బాలీవుడ్ లో కూడా కంబ్యాక్ అయింది. సినిమాల‌తో పాటు ఓటీటీ సిరీస్ ల‌కు సైన్ చేస్తోంది. అవ‌స‌రం మేర భార్య‌ని ప్ర‌మోట్ చేయ‌డానికి సూర్య కూడా సీన్ లోకి వ‌స్తున్నాడు. ఇక ప్రియ‌మ‌ణి పెళ్లికి ముందు పెళ్లి త‌ర్వాత కూడా అదే దూకుడు కొనసాగి స్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంటుంది. అస‌వ‌రం మేర టీవీ షోలు చేస్తుంది.

తాను హీరోయిన్ అనే సంగ‌తి ప‌క్క‌న‌బెట్టి అంద‌రితో ఎంతో క‌లివిడిగానూ ఉంటుంది. ప్రియ‌మ‌ణిలో ఈ ర‌క‌మైన ల‌క్షణం అంద‌రికీ ఎంతో న‌చ్చింది. అందుకే తెలుగులో ఆమెని హీరోలంతా ప్ర‌త్యేకంగా గౌర‌వి స్తుంటారు. బ్యూటీ ప‌రంగానూ ప్రియ‌మ‌ణిలో అందం ఏమాత్రం త‌రిగిపోలేదు. ఇటీవ‌లే `భామాక‌లాపం-2` తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి స‌క్స‌స్ అందుకుంది. పెళ్లికాని ప్రియ‌మ‌ణి లానే ఉందంటూ కాంప్లిమెట్లు అందుకుంది.ఇంకా దీపికా పదుకొణే..అలియాభ‌ట్..క‌త్రినా కైఫ్‌...క‌రీనా క‌పూర్ వీళ్లంతా కూడా పెళ్లైన త‌ర్వాత మార్కెట్ లో రెట్టింపు వేగంతో దూసుకుపోతున్నారు. వాళ్ల పారితోషికాలు ఇప్పుడు భారీగా పెరిగాయి. ఇదంతా పెళ్లి తెచ్చిన మార్పు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News