SSMB29 నటి ఇందేంటి మెస్సీ బికినీ స్టైల్?
సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ఎస్ఎస్ఎంబి 29లో ప్రియాంక చోప్రా నటిస్తోందని కథనాలొస్తున్నాయి
సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ఎస్ఎస్ఎంబి 29లో ప్రియాంక చోప్రా నటిస్తోందని కథనాలొస్తున్నాయి. కొద్ది రోజులుగా మహేష్- ప్రియాంక చోప్రాపై ప్రత్యేక ఫోటోషూట్లు, ప్రాక్టీస్ సెషన్స్ చేసారని గుసగుసలు వినిపించాయి. ప్రియాంక చోప్రా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగు కోసం ఉన్నారు.
మరోవైపు పీసీ తన సోదరుడి పెళ్లి కోసం ముంబై వెళ్లాల్సి ఉందని కథనాలొచ్చాయి. ఇదిలా ఉండగానే గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫోటోషూట్ ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. ప్రఖ్యాత హార్పర్ బజార్ కవర్ పేజీపై పీసీ ప్రయోగాత్మక లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. ప్రియాంక చోప్రా ఒక ప్రత్యేకమైన డిజైనర్ మెస్సీ డ్రెస్ ని ధరించి కనిపించింది. ఇది చూడటానికి బికినీని తలపిస్తోంది. మరోవైపు మెడలో ఒక డిజైనర్ స్నేక్‌ని ఆభరణంగా ధరించింది. `బజార్ యూకే` తాజా కథనంలో ప్రియాంక చోప్రా గురించి ఆసక్తికర విషయాలను ప్రచురించింది.
నటి, నిర్మాత, వ్యవస్థాపకురాలు #ప్రియాంకచోప్రా జోనాస్ ఒక అద్భుతమైన శక్తి. మార్చి సంచిక @bazaarukలో హాలీవుడ్ ఐకాన్ హెలెనా డిబెర్టోడనో తో తన కెరీర్, తన బాలీవుడ్ నేపథ్యం.. తన తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంది...అని బజార్ యుకే వెల్లడించింది. ప్రియాంక చోప్రా ఈ కొత్త లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.