నాభిలో ముత్యం మెడలో కెంపు కట్టి పడేస్తున్నాయిగా!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చొప్రా రొటీన్ లైఫ్ లుక్ ఇది. ఇంట్లో ఉన్నప్పుడు స్వేచ్ఛగా అలా సెల్ఫీ దిగుతూ కనిపించింది.
నాభికి అలంకరించిన ముత్యాలు.. మెడలో నీలి రంగు కెంపు..విరబోసిన శిరోజాలు.. బ్లాక్ ట్రాక్.. బ్లాక్ బ్లౌజ్.. ఈ లుక్కు చూశారా? గ్లోబల్ స్టార్ ప్రియాంక చొప్రా రొటీన్ లైఫ్ లుక్ ఇది. ఇంట్లో ఉన్నప్పుడు స్వేచ్ఛగా అలా సెల్ఫీ దిగుతూ కనిపించింది. కానీ చాలా ప్రత్యేకంగా కనిపించింది బెడ్ రూమ్ లో..
ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. అన్నట్టు పీసీ హబ్బీ నిక్ జోనాస్ పెళ్లికి వెళ్లాడు కదా? ఈ ఫోటో తీసినది ఎవరై ఉంటారు? ఏమో.. కానీ పీసీని వందశాతం నేచురల్ టోన్ లో ఫోటోగ్రాఫ్ చేయడంలో సక్సెసయ్యారనే చెప్పాలి. చాలా మంది సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారో బయటపెట్టరు. కానీ పీసీ అందుకు భిన్నంగా తన ఒరిజినల్ రూపాన్ని బయటపెడుతోంది. ఈ లుక్ కోసం పీసీ ఎలాంటి మేకప్ చేసుకోలేదు. సాధ్యమైనంత నేచురల్ గా కనిపించింది.
ఇంతకీ నిక్ జోనాస్ సీన్ లో లేకుండా ఎక్కడికి వెళ్లి ఉంటాడు? అంటే...అతడు ఇటీవల న్యూయార్క్లో ప్రియాంక చోప్రా కజిన్ వివాహానికి హాజరయ్యారు. పీసీ హాజరుకానప్పటికీ నిక్ తన అత్తగారు మధు చోప్రాతో వివాహ వేడుకలో కనిపించాడు. మధు, ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా, అతడికి కాబోయే భార్య నీలం ఉపాధ్యాయతో కలిసి కొన్ని ఫోటోలకు పోజులిచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే నెట్ లో వైరల్ అయ్యాయి.ప్రియాంక చోప్రా ప్రస్తుతం సిటాడెల్ సీజన్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు హిందీ చిత్రాల్లో నటించేందుకు పీసీ ఆసక్తిగా ఉంది. కానీ ఇంకా దీనిపై అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.