ప్రియాంక చోప్రా ఇంతలోనే దేనికి ఈ బ్రేకప్?
పీసీ ప్రతినిధి మాట్లాడుతూ... పీసీ భాగస్వామ్యానికి దూరంగా ఉన్నారని అయితే సోనాను ప్రారంభించడం నిలబెట్టడం తన కెరీర్లో గర్వించదగిన ముఖ్యమైన క్షణం అని అన్నారు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో నటిస్తూనే భారతదేశంలో తన సత్తా చాటేందుకు ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. హిందీ చిత్రసీమలో తనవైపు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. మరోవైపు పీసీ ఎంటర్ ప్రెన్యూర్ గా తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన పీసీ పలు అగ్ర నిర్మాణ సంస్థల భాగస్వామ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
మరోవైపు అమెరికాలో పీసీ రెస్టారెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెస్టారెంట్లకు సోనా అనే బ్రాండ్ నేమ్ ని పెట్టుకున్నారు. తొలిగా 2021లో తన స్నేహితుడు మనీష్ కె గోయల్‌తో కలిసి న్యూయార్క్ లో 'సోనా' అనే రెస్టారెంట్ ని ప్రారంభించింది.
సోనా అంటే-గోల్డ్. ఈ పేరును నిక్ జోనాస్ సూచించారు. ఈ హోటల్ లో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఫేమస్ అయిన వంటకాలను రుచి చూపించడానికి ప్రాధాన్యతనివ్వడం విశేషం.
తాజా సమాచారం మేరకు.. ప్రియాంక చోప్రా ఇకపై 'సోనా'లో భాగస్వామి కాదని కథనాలొచ్చాయి. పీసీ ప్రతినిధి మాట్లాడుతూ... పీసీ భాగస్వామ్యానికి దూరంగా ఉన్నారని అయితే సోనాను ప్రారంభించడం నిలబెట్టడం తన కెరీర్లో గర్వించదగిన ముఖ్యమైన క్షణం అని అన్నారు. రెస్టారెంట్ తెరిచి ఉంటుంది... ప్రియాంక చోప్రా జోనాస్‌తో కలిసి పనిచేయడం అనే కల నిజమైందని సహ వ్యవస్థాపకుడు మనీష్ నివేదించారు.
పీసీ భాగస్వామ్యానికి మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రియాంక ఎప్పటికీ సోనా కుటుంబంలోనే ఉంటుందని అయితే ఇకపై సృజనాత్మక భాగస్వామిగా ఉండరని మనీష్ తెలిపారు. సిటాడెల్ తర్వాత ప్రియాంక చోప్రా పలు చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీ అయ్యారు.