పాపం గ్లోబ‌ల్ స్టార్ బావ గారికి ఎంత క‌ష్టం?

గాయకుడు కెవిన్ తన నుదిటిపై హెయిర్‌లైన్ దగ్గర ప్రాణాంతక మొటిమను ఉంద‌ని కనుగొన్నాడు. చికిత్స తర్వాత ఇది చర్మ క్యాన్సర్ అని తెలిసింది.

Update: 2024-06-12 23:30 GMT

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా బావ, పాప్ సింగర్ కెవిన్ జోనాస్ కి ఊహించ‌ని క‌ష్ట‌మొచ్చింది. అత‌డిని క‌ష్టం నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు చాలా శ్ర‌మించాల్సొచ్చింది. అస‌లింత‌కీ కెవిన్‌కి ఏమైంది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

కెవిన్ జోనాస్ ప్రియాంక చోప్రా భ‌ర్త అయిన నిక్ జోనాస్ కి అన్న‌గారు. అత‌డు స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు శస్త్రచికిత్స అవ‌స‌ర‌మైంది. ఇటీవల చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన అత‌డు త‌న శ‌స్త్ర చికిత్స అనంత‌రం వీడియోను షేర్ చేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

గాయ‌కుడు కెవిన్ ఆసుపత్రికి చేరుకోగా ప‌రీక్షించిన వైద్యులు చర్మ క్యాన్సర్ ఉన్నట్లు కనుగొన్నారు. అతడు తన ఇన్‌స్టాగ్రామ్ లో శస్త్రచికిత్సకు ముందు తరువాత వీడియోను షేర్ చేసాడు. దీనితో పాటు అత‌డు త‌నవంతు బాధ్య‌త‌గా ప్ర‌జ‌లను కూడా హెచ్చరించాడు. శ‌రీరంపై మ‌చ్చ‌లు కాయ‌ల‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కెవిన్ సూచించారు.

అస‌లింత‌కీ ఏమిటా స‌మ‌స్య‌?

గాయకుడు కెవిన్ తన నుదిటిపై హెయిర్‌లైన్ దగ్గర ప్రాణాంతక మొటిమను ఉంద‌ని కనుగొన్నాడు. చికిత్స తర్వాత ఇది చర్మ క్యాన్సర్ అని తెలిసింది. అటుపై ఇన్ స్టాలో తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని షేర్ చేసాడు. ప్ర‌జ‌లు ఎప్పుడూ త‌మ‌ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. క్యాన్స‌ర్ ఉంది కాబ‌ట్టి ఈరోజు నా తలపై నుంచి బేసల్ సెల్ కార్సినోమాను తొలగిస్తున్నారు! అంటూ వీడియోలో తెలిపాడు. కెమెరాను స్కిన్ అసహజంగా ఉన్న ప్రదేశానికి దగ్గరగా ఉంచి.. నిజానికి ఇది ఒక చిన్న చర్మ క్యాన్సర్.. కానీ పెరగడం ప్రారంభించింది. ఇప్పుడు నేను దానిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకోవాలి! అని చెప్పాడు. శ‌స్త్ర చికిత్స అనంత‌రం 'లీవ్ బిఫోర్ యు లవ్ మి' అనే క్యాప్ష‌న్ ని ఇచ్చాడు.

''మీ పుట్టుమచ్చలను తనిఖీ చేసుకోండి.. ఇది స్నేహపూర్వక రిమైండర్'' అని కూడా కెవిన్ రాసాడు. క్యాన్సర్ శస్త్రచికిత్స తర్వాత కూడా గాయకుడి నుదిటిపై గాజుగుడ్డ టేప్ ని వీడియో తీసి ప్ర‌ద‌ర్శించారు. ఎమోజీలతో సర్జరీ మచ్చను దాచే ప్రయత్నం చేశాడు. మొటిమ ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూసిన‌ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొటిమ చర్మ క్యాన్సర్‌గా ఎలా మారుతుందో తెలుసుకోవాల‌ని చాలా మంది భావించారు. కెవిన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

అంతకుముందు ప్రియాంక చోప్రా భ‌ర్త‌ నిక్ జోనాస్ తన ఆరోగ్య సమాచారాన్ని కూడా అభిమానుల‌కు షేర్ చేసాడు. తనకు ఫ్లూ వచ్చిందని అభిమానులకు చెప్పాడు. దీని కారణంగా త‌దుప‌రి పర్యటనను ఆగస్టు వరకు వాయిదా వేసాడు. కెవిన్ తన సోదరుడు నిక్ లాగా ప్రియాంక చోప్రాతో చాలా సన్నిహితంగా ఉంటాడు. నిక్‌తో పాటు కెవిన్ కూడా భారతదేశానికి వచ్చి కచేరీలో ప్రదర్శన ఇచ్చాడు.

Tags:    

Similar News