సినిమాకి 40 కోట్లు అందుకునే ఏకైక భార‌తీయ న‌టి?

భార‌త‌దేశంలో ఒక్కో సినిమాకి 40 కోట్లు అందుకుంటున్న ఏకైక క‌థానాయికగా ఈ బ్యూటీ ఒక సంచ‌ల‌నం.

Update: 2024-05-20 11:30 GMT

భార‌త‌దేశంలో ఒక్కో సినిమాకి 40 కోట్లు అందుకుంటున్న ఏకైక క‌థానాయికగా ఈ బ్యూటీ ఒక సంచ‌ల‌నం. మాజీ మిస్ ఇండియా.. విశ్వ‌సుంద‌రిగా కీర్తి కిరీటాన్ని అందుకుని న‌టిగా కెరీర్ ని ప్రారంభించి.. మూడు ద‌శాబ్ధాల పాటు అజేయంగా ప‌రిశ్ర‌మ‌ల్ని ఏలిన స‌ద‌రు న‌టీమ‌ణి మ‌రెవ‌రో కాదు.. ది గ్రేట్ ప్రియాంక చోప్రా.


నేడు బాలీవుడ్ టు హాలీవుడ్ స‌త్తా చాటిన‌ పీసీ (అక‌) ప్రియాంక చోప్రా భార‌త‌దేశంలో కోటి పారితోషికం అందుకున్న తొలి క‌థానాయిక‌గా రికార్డులు బ్రేక్ చేసింది. న‌టిగా కెరీర్ ప్రారంభించిన 30 సంవ‌త్స‌రాల‌కు ఒక్కో సినిమాకి 40 కోట్ల పారితోషికం అందుకుంటూ సంచ‌ల‌నంగా మారింది. అప్ప‌ట్లో ఒక హీరోయిన్ కోటి అందుకోవ‌డం అంటే అది చాలా అరుదు. అలాంటి స‌మ‌యంలోనే కోటి అందుకుని రికార్డ్ బ్రేక్ చేసింది. అన్ని మీమాంశ‌ల‌ను అధిగ‌మించి నాయికా ప్ర‌ధాన చిత్రాల‌తోను స‌త్తా చాటింది.

ఈరోజు ప్రియాంక చోప్రా హాలీవుడ్ న‌టిగా గొప్ప క్రేజ్ ను అందుకున్నారు. గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగారు. అందుకే తాను ఎంత డిమాండ్ చేస్తే అంతా నిర్మాత‌లు ఇచ్చుకోవాల్సిందే. అయితే త‌న మార్కెట్ ని గ్లోబ‌ల్ స్థాయికి విస్త‌రించ‌డం ద్వారా మాత్ర‌మే పీసీ ఈ స్థాయిని అందుకుంద‌ని కూడా మార్కెట్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. భారతదేశం నుండి అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా పీసీ అర్హత సాధించింద‌ని కూడా ట్రేడ్ విశ్లేషిస్తోంది.

ప్రియాంక చోప్రా త‌ర్వాత‌ కంగనా రనౌత్, కత్రినా కైఫ్ ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కరీనా కపూర్, అనుష్క శర్మ, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి వారు రూ. 10-20 కోట్ల మధ్య వసూలు చేస్తారు. దీపికా పదుకొణె 20కోట్లు డిమాండ్ చేస్తోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆ త‌ర్వాత‌ అలియా భట్ 12 కోట్లు అందుకుంటోంద‌ని ప్ర‌చారం ఉంది. కానీ గ్లోబ‌ల్ మార్కెట్లో హ‌వా సాగిస్తున్న దేశీ గాళ్ పీసీ ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 40 కోట్ల వరకు వసూలు చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో షో సిటాడెల్ కోసం 40 కోట్లు వ‌సూలు చేసింద‌ని టాక్ ఉంది. ఫోర్బ్స్ ప్రకారం.. భారతదేశంలో ఒక్కో చిత్రానికి 14-20 కోట్ల మేర పారితోషికం అందుకుంటోంది.

Tags:    

Similar News