అమెరికన్ల మత్తు దించేసిన పీసీ నల్ల కోక
ఇంతకుముందు అంతర్జాతీయ వేదికలపై చాలా మంది కథానాయికలు చీరలో తమదైన ముద్ర వేసినా కానీ, వాటన్నిటి కంటే పీసీ హాట్ గా కనిపిస్తోందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.
అవును .. అమెరికన్ల మత్తు దిగింది! ఆమె నల్ల కోక సౌందర్యానికి అమెరికా వీధుల్లో మంటలు పుట్టాయి. ఇదిగో ఇక్కడ ఈ సన్నివేశాన్ని నేరుగా చూసాక యువతరం కూడా దీనిని అంగీకరిస్తారు. కోక రవికెలో ఇంత అందంగా ముస్తాబవ్వడం అనేది ఒక్క పీసీకే చెల్లింది. ఇంతకుముందు అంతర్జాతీయ వేదికలపై చాలా మంది కథానాయికలు చీరలో తమదైన ముద్ర వేసినా కానీ, వాటన్నిటి కంటే పీసీ హాట్ గా కనిపిస్తోందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.
యుఎస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రియాంక చోప్రా నల్లని మెరిసే చీరలో సబ్యసాచి ముఖర్జీతో కలిసి పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారాయి. కాలిఫోర్నియాలో ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ హోస్ట్ చేసిన ఈవెంట్‌కు పలువురు ప్రముఖులతో పాటు ప్రియాంక చోప్రా కూడా హాజరయ్యారు. విందు నుంచి వచ్చిన పీసీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో క్షణాల్లో వైరల్ అయ్యాయి.
ప్రియాంక డిన్నర్ సమయంలో సబ్యసాచి పక్కన కూర్చుని కనిపించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ కోసం ప్రియాంక నల్ల చీరలో ప్రత్యక్షమైంది. దీనికి కాంబినేషన్ గా గోల్డెన్ నెక్‌పీస్‌లో అద్భుతంగా కనిపించింది. సబ్యసాచి నల్లటి సమిష్టి రూపాన్ని డిజైన్ చేయడం ఆసక్తికరం.. చొక్కా, ప్యాంటు, కోటు, శాలువాను అతడు ధరించాడు. ఈ ప్రదేశం బెవర్లీ హిల్స్, కాలిఫోర్నియాగా జియో ట్యాగ్ చేసారు. సబ్యసాచి బెవర్లీ హిల్స్‌లోని సాక్స్ ఫిఫ్త్ అవెన్యూ కొత్త ఫ్లాగ్‌షిప్‌లో ప్రత్యేక సేకరణను ప్రదర్శించారు. మార్చి 7న ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 11 వరకు కొనసాగనుంది.
చీరకట్టుపై ఒకటే కామెంట్లు
అమెరికా ఈవెంట్‌లో చీరకట్టులో ప్రత్యక్షమైన ప్రియాంక ఫోటోలకు అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు పీసీ ఫోటోలను జోరుగా వైరల్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా మళ్లీ చీర కట్టులో చాలా ఆందంగా ఉంది...! చీర తనకు బాగా సరిపోతుంది!! అని ఒక అభిమాని అన్నారు. మరొక వ్యక్తి ఇలా రాసాడు. ``ఆమె అద్భుతంగా ఉంది..ఆమెను గ్లామరస్ మూడ్‌లో చూసి కొంతకాలం అయ్యింది`` అని అన్నాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ది బ్లఫ్‌లో అభిమానులు ప్రియాంకను చూస్తారు. ఇందులో కార్ల్ అర్బన్ కూడా నటించారు. 19వ శతాబ్దపు కరేబియన్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఇది రూపొందింది. `ది బ్లఫ్` ఒక మాజీ మహిళా పైరేట్ (ప్రియాంక)కి చెందిన కథ. ఈ కథాంశం ప్రకారం.. కథానాయిక గతంలోని రహస్యమైన కార్యాలతో సంచలనంగా మారుతుంది. అదంతా తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చేసినవే. ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇటీవల ప్రియాంక ఆస్కార్ కి నామినేట్ అయిన `టు కిల్ ఎ టైగర్` అనే డాక్యుమెంటరీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసింది. దేవ్ పటేల్, మిండీ కాలింగ్ సహా పలువురితో కలిసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా టీమ్‌లో చేరారు. టు కిల్ ఏ టైగర్ చిత్రానికి నిషా పహుజా దర్శకత్వం వహించారు. ఇది కాకుండా ప్రియాంక దేశాధినేతలు, జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బాలతో కలిసి కనిపించనుంది.