ప్రియాంక గ్లోబల్ స్టార్ వెనుక తల్లి పాత్ర ఇలా!
నేడు ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటోంది. పీసీ అంటే తెలియని వారెవ్వరు లేరు.
నేడు ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటోంది. పీసీ అంటే తెలియని వారెవ్వరు లేరు. ప్రపంచ దేశాల్లోనే పీసీ అంటే ఓ బ్రాండ్. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే ఆ స్థాయికి చేరింది. కోలీవుడ్ టూ బాలీవుడ్ అక్కడ నుంచి నేరుగా హాలీవుడ్ కి వెళ్లే ఇంగ్లీష్ సినిమాల్లోనే సత్తా చాటుతుంది. ఇది ప్రియాంక చోప్రాకి మాత్రమే సాధ్యమైంది. పీసీ కంటే ముందు తర్వాత చాలా మంది ట్రై చేసారు. కానీ పీసీ సక్సెస్ అయినంతగా మరొకరు సక్సెస్ అవ్వలేదు.
అయితే ఈ రకమైన జీవితాన్నీ ప్రియాంక ఏ నాడు కనీసం ఊహించి కూడా ఉండదు? ఎందుకంటే సినిమాలు చేయాలనే ఆసక్తి ఆమెకి ఏ మాత్రం లేదన్న సంగతి ఆలస్యంగా బయటకు వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పీసీ తల్లి మధు చోప్రా రివీల్ చేసారు. `సినిమాల్లో నటించాలని ప్రియాంక ఎప్పుడూ అనుకోలేదు. తొలిసారి సౌత్ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. ఈ విషయం తనకి చెబితే ఏడిచింది.
సినిమాలు చేయనని కన్నీళ్లు పెట్టుకుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని నేను సముదాయించా. అలా తమిళ సినిమాకి సైన్ చేసింది. సెట్స్ కి వెళ్లిన తర్వాత నటపై ఆసక్తి మొదలైంది. అది రోజు రోజు ఎక్కువైంది. చిత్ర యూనిట్ కూడా ఎంతో బాగా చూసుకుంది. హీరో విజయ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనో జెంటిల్ మెన్. ఆ సినిమాకి రాజు సుందరం కొరియోగ్రాఫర్. ప్రియాంకకి డాన్సు సరిగ్గా రాదు.
విజయ్ తో డాన్స్ చేయడానికి చాలా కష్టపడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొరియోగ్రాఫర్స్ తో కలిసి ప్రాక్టీస్ చేసేది. ఎంతో ఇష్టంగా పని నేర్చకుంది. ఆ వాతావరణం నచ్చడంతో సినిమా ని కెరీర్ గా ఎంచుకుంది` అని తెలిపింది. అదే నాడు మధు చోప్రా కుమార్తె ఇష్టం మేరకు ఏడిచింది అని వదిలేస్తే! నేడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ లేదు. బాలీవుడ్ లో కనీసం కెమెరా కూడా ఫేస్ చేసేది కాదు. తల్లి కారణంగా సినిమా పీసీ జీవితంలోకి వచ్చింది. అందుకు పీసీ జన్మంతా తల్లికి రుణపడాల్సిందే.