చెల్లి పెళ్లి స్కిప్ కొట్టి పీసీ ఏం చేసిందంటే?
లాస్ ఏంజెల్స్‌లోని మాలిబులోని సోహో హౌస్‌లో ప్రియాంక తన స్నేహితురాలి బేబీ షవర్‌కు కూడా హాజరైనట్లు ఈ ఫోటోలో కనిపించింది.
ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా AAP నాయకుడు రాఘవ్ చద్దాని పెళ్లాడిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు ఈ వేడుకలు ఇరు కుటుంబాలు బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా సాగాయి. అయితే తన సోదరి పరిణీతి చోప్రా 2 రోజుల వివాహ వేడుకలకు ప్రియాంక దూరంగా ఉంది. వైభవంగా సాగిన పెళ్లికి పీసీ స్కిప్ కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇంట్లో ఎంతో ముఖ్యమైన వేడుకను స్కిప్ కొట్టేంతగా ప్రియాంక చోప్రా బిజీగా ఉందా? అంటూ ఆరాలు కొనసాగాయి. అయితే దానికి సరైన జవాబు లేదు. ఇంతకుముందే ''పీసీ ఈ పెళ్లి వేడుకకు రాలేకపోయింది.. బిజీ షెడ్యూళ్ల కారణంగానే రాలేదు!'' అంటూ ఆమె తల్లి మధు చోప్రా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అది సహేతుకంగా అనిపించలేదు.
భారతదేశంలో ఈ వివాహం జరుగుతున్న సమయంలో పీసీ యునైటెడ్ స్టేట్స్లో ఉంది. ఉదయపూర్ లో జరిగిన ఈ వివాహానికి రాలేకపోయినందున ప్రియాంక సింపుల్ గా ఇన్ స్టాలో ఒక మెసేజ్ ని కూడా పంపింది. మేలో జరిగిన పరిణీతి నిశ్చితార్థానికి ప్రియాంక హాజరవగా, సెప్టెంబర్ 24న పెళ్లికి దూరమైంది. రాగ్నీతి వివాహానికి దూరంగా ఉన్న సమయంలో పీసీ సందేశం అందరి దృష్టిని ఆకర్షించింది.
పరిణీతి చోప్రా పెళ్లి రోజున లాస్ ఏంజెల్స్ (LA-అమెరికా)లోని గ్రీక్ థియేటర్లో ప్రియాంక చోప్రా బావ ఫ్రాంక్లిన్ జోనాస్‌తో కలిసి జై వోల్ఫ్ కచేరీని ఆస్వాధిస్తూ పీసీ కనిపించింది. బంగ్లాదేశ్ నటుడు-కొరియోగ్రాఫర్ బుష్రా ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో ఈ విషయాన్ని లీక్ చేసింది.
లాస్ ఏంజెల్స్‌లోని మాలిబులోని సోహో హౌస్‌లో ప్రియాంక తన స్నేహితురాలి బేబీ షవర్‌కు కూడా హాజరైనట్లు ఈ ఫోటోలో కనిపించింది. ఈ ఫోటోల్లో పీసీ తెల్లటి మిడి ధరించింది. మరోవైపు స్విమ్మింగ్ పూల్ లో పీసీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోని పీసీ షేర్ చేయగా, దానిపై నెటిజనులు తీవ్రంగా కామెంట్ చేస్తున్నారు.
పెళ్లికి హాజరు కాలేకపోయినా కానీ, సోదరి పరిణీతి చోప్రాకు పీసీ శుభాకాంక్షలు తెలియజేసింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పరిణీతి కోసం ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేసింది. పెళ్లి వేడుకకు సంబంధించిన కొత్త జంట ఫోటోలను షేర్ చేస్తూ.. ''పిక్చర్ పర్ఫెక్ట్.. కొత్త జంటకు నా ప్రేమ..! చోప్రా కుటుంబానికి స్వాగతం @raghavchadha88 .. మీరు సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మా వెర్రి బృందంతో కలిసిపోండి'' అంటూ ప్రేమను పంచింది. మీరు సరిజోడీ. ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ అందమైన ప్రేమను కాపాడుకోండి.. అంటూ కొత్త జంటకు సందేశం పంపింది పీసీ. తాను పెళ్లికి దూరమైనప్పటికీ తన సోదరి జీవితంలోని తదుపరి అధ్యాయానికి శుభాకాంక్షలు తెలిపింది. సోదరి భర్త రాఘవ్ చద్దాతో పీసీ ఫన్ కూడా చర్చకు వచ్చింది.