పాకిస్తాన్ లోనూ ఆ బ్యూటీకి అభిమాన సంఘాలు!
మరి అలాంటి పాకిస్తాన్ లో ఓ యంగ్ బ్యూటీకి ఏకంగా అభిమాన సంఘాలే ఉన్నాయంటే? నమ్ముతారా? అంటే నమ్మాల్సిందే అంటోంది ప్రియా ప్రకాష్ వారియర్.
పాకిస్తాన్ నటులు..గాయకులకు ఇండియాలో చాలా మంది అభిమానులున్నారు. అందుకే బాలీవుడ్ లో ఇప్పటికీ పాక్ స్తాన్ కి చెందిన ఎంతో మంది కళాకారులు కొనసాగుతున్నారు. కొత్త వారు వెలుగులోకి వస్తున్నారు. వాళ్లని ప్రోత్సహిస్తున్నారు. కానీ పాకిస్తాన్ లో భారతీయ నటులకు అభిమానులున్నారా? అంటే అది చాలా తక్కువనే చెప్పాలి. పాకిస్తాన్ లో భారతీయ చిత్రాలు రిలీజ్ అవ్వడం అన్నది చాలా రేర్.
ఒకవేళ అయినా నానా హంగామా చోటు చేసుకుంటుంది. అలాంటి సంఘటనలు ఇప్పటికే చాలాసార్లు జరిగాయి. మరి అలాంటి పాకిస్తాన్ లో ఓ యంగ్ బ్యూటీకి ఏకంగా అభిమాన సంఘాలే ఉన్నాయంటే? నమ్ముతారా? అంటే నమ్మాల్సిందే అంటోంది ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను గీటి ఓవర్ నైట్ లో ఫేమస్ అయిన బ్యూటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ పాపులారిటీ ఏకంగా భారతీయ భాషలన్నింటిలోనూ అవకాశాలు తెచ్చి పెట్టింది.
తెలుగులో లో ఇప్పటికే 'చెక్' సినిమాలో నటించింద. త్వరలో 'బ్రో 'సినిమాతో మెప్పించడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ లో తనకున్న ఫాలోయింగ్ గురించి తెలిపింది. 'ఇంటర్ నుంచి మోడలింగ్ చేస్తూనే కొన్ని షార్ట్ ఫిలింస్ చేసాను. డిగ్రీ మొదటి సంవత్సరంలో 'లవర్స్ డే' సినిమా లో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో కన్నుగీటిన సన్నివేశం హైలైట్ అవ్వడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాను.
తెలుగు అభిమానులైతే ప్రియా ప్రియా చంపొద్దు అంటూ నా కోసం గుడి కట్టేసుకున్నారు. అప్పుడే నాకు పాకిస్తాన్ లోనూ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్న సంగతి తెలిసింది. కన్ను గీటిన వీడియో పాకిస్తాన్న కుర్రకారుని కూడా కదిలిచింది. రోజు ఎన్నో వీడియోలు వస్తుంటాయి.
కానీ దేనికి కనెక్ట్ కాని పాక్ అభిమానులు నా వీడియోకి కనెక్ట్ అయి మెసెజ్ లు పెట్టేవారు. బాగా చేసావని మెచ్చుకున్నారు. మీ కోసం ఇక్కడ అభిమాన సంఘాలే ఉన్నాయని వాళ్లు చెబుతుంటే నమ్మలేకపోయేదాన్ని. ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు 'ఒరు ఆదార్ లవ్' లో నా పాత్రని పెంచడానికి దోహద పడ్డాయి ' అని అన్నారు.