అన్నా-తమ్ముడు-కొడుకు సైలైంట్ అయితే ఎలా!
పూరి జగన్నాధ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఎంతో మంది స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేసాడు.
పూరి జగన్నాధ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఎంతో మంది స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేసాడు. ఇండస్ట్రీకి స్టార్ హీరోల్ని అందించాడు. బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేసాడు. అలా ఇండస్ట్రీలో తానో బ్రాండ్ అయ్యాడు. అటుపై తమ్మడు సాయిరాం శంకర్ ని కూడా పరిశ్రమకి తీసుకొచ్చాడు. పెద్ద హీరోని చేయాలనుకున్నాడు. కానీ ఎందుకనో సాయిరాం అనుకున్నంతగా కనెక్ట్ అవ్వలేదు.
ఈ విషయంలో పూరి కాస్త పెయిన్ ఫీలయ్యాడు. తాను పెద్ద డైరెక్టర్ అయినా తమ్ముడ్ని స్టార్ ని చేయలేకపోయాననే బాధ ఆయనలో ఉంది. అటుపై సాయి తన సొంత ప్రయత్నాలతో కొన్ని సినిమాలు చేసాడు. ఇప్పటికీ ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే కొత్తతరం రావడంతో అవకాశాలు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో పూరి తనయుడు ఆకాష్ కూడా లాంచ్ అయ్యాడు. తండ్రితో మెహబూబా సినిమా చేసాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు.
తాను సొంతంగా కొన్ని ప్రాజెక్ట్ లు సెట్ చేసుకుని నటించాడు. కానీ అవేవి ఆకాష్ కి కలిసి రాలేదు. మరి ఇప్పుడా ముగ్గురు పరిస్థితి ఏంటి? అంటే ఒకేలా కనిపిస్తుంది. `ఇస్మార్ట్ శంకర్` మినహా గత కొంత కాలంగా పూరి సినిమాలేవి సరిగ్గా ఆడలేదు. దీంతో పూరి మార్కెట్ బాగా డౌన్ అయిందనే వార్తలొస్తున్నాయి. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే రెండు..మూడు ప్రాజెక్ట్ లు లైన్ లో పెట్టే పరిస్థితి ఇప్పుడు పూరి ముందు కనిపించలేదు.
సాయిరాం శంకర్ ఈ ఏడాది `వెయ్ దరువెయ్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ సక్సెస్ అవ్వలేదు. ప్రస్తుతం `బంపర్ ఆఫర్` సీక్వెల్ గా బంపర్ ఆఫర్ -2 చేస్తున్నాడు. `ఒక పధకం ప్రకారం` అనే మరో సినిమా చేస్తున్నాడు. ఇక ఆకాష్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి రెండున్నరేళ్లు దాటిపోయింది. చివరిగా` చోర్ బాజర్` తో వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొత్త సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. మరి 2025లోనైనా కొత్త సినిమా కబురేదైనా చెబుతాడా? అన్నది చూడాలి.