పూరికి కామెడీ సలహా ఇచ్చిన స్నేహితుడు!
ఈ నేపథ్యంలో పూరి స్నేహితుడు, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే పూరికి కొన్ని సలహాలు ఇస్తున్నారు. పూరి స్టోరీ ల ఎంపిక మారాలి.
పూరి జగన్నాధ్ ఇప్పుడెలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలిసిందే. హిట్ లేక సతమతమవుతున్నారు. `టెంపర్` తర్వాత ఆ రేంజ్ సక్సెస్ `ఇస్మార్ట్ శంకర్` తో వచ్చినా అది ఎంతో కాలం నిలబడలేదు. మధ్యలో చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. మరి ఈ ప్లాప్ లకు కారణం ఏంటి? అంటే ఒకే జానర్లో సినిమాలు చేయడంతోనే ప్లాప్ అయ్యాయి అన్నది అందిరికీ తెలిసిందే. దీంతో పూరికి ఇండస్ట్రీ నుంచి విజయేంద్ర ప్రసాద్ లాంటి స్టార్ రైటర్ సలహా కూడా ఇచ్చారు.
ఎంచుకునే స్టోరీ విషయంలో సినిమా తీసే ముందు తనకో మాట చెప్పమన్నారు. అన్నట్లే డబుల్ ఇస్మార్ట్ స్టోరీ ఆయనకు చెప్పే చేసారు. ఈ సినిమా విషయంలో పూరి చాలా జాగ్రత్తగానే ఎక్కువ సమయం తీసుకునే చేసాడు. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ అయింది. రోటీన్ కథ కావడంతోనే మళ్లీ వైఫల్యం తప్పలేదు. ఈ నేపథ్యంలో పూరి స్నేహితుడు, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే పూరికి కొన్ని సలహాలు ఇస్తున్నారు. పూరి స్టోరీ ల ఎంపిక మారాలి.
ఒకే పేట్రన్ లో సినిమాలు చేస్తున్నారు. స్టోరీ నేపథ్యం మారాలి. మేకింగ్ పరంగా ఆయనకు తిరుగులేదు. మళ్లీ గొప్ప కంబ్యాక్ ఇస్తాడు. పూరి తీయాలనకుంటే మంచి కామెడీ సినిమా తీయలగడు. మంచి కామెడీ ట్రాక్ లు రాయడం ఆయనకు బాగా తెలుసు. ప్రతీ సినిమాలోనూ అద్భుతమైన కామెండీ పండిచగల దర్శకుడు. సీరియస్ యాక్షన్ స్టోరీల్లో కడుపుబ్బా నవ్వించే ట్రాక్స్ రాయడం..వాటిని తీయడంలో ఆయన స్పెషలిస్ట్.
ఇక పూర్తి జానర్ లో కామెడీ సినిమా చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఆయన తీయడు. అదే వచ్చిన సమస్య. ఆయన పాత ట్రాక్ ని దాటి ఒక్క అడుగు ముందుకు వేస్తే అద్బుతాలు చేయగలడు. సినిమా ను ఆయనంత వేగంగా ఎవరూ చేయలేరు. ఇది పూరికి మాత్రమే తెలిసిన టెక్నిక్` అన్నారు.