అరంగేట్రంపై పూరి తల్లి సంచలన వ్యాఖ్యలు!
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ మేకర్ గా రికార్డులే సృష్టించాడు.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఓ మారుమూల కుగ్రామం నుంచి హైదరాబాద్ కి వచ్చి టాలీవుడ్ ని ఏలిన దర్శకుడు అయన. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ మేకర్ గా రికార్డులే సృష్టించాడు.ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి వందల కోట్లు ఆస్తులు సంపాదించిన దర్శకుడు. వాటిని అజాగ్రతత్తతో పోగొట్టుకున్న ఏకైక దర్శకుడు కూడా ఆయనే.
పూరి డైరెక్టర్ అయిన తర్వాత తన ఫ్యామిలీ లైఫ్ మొత్తం మారిపోయింది. తమ్ముడు సాయి రాం శంకర్ హీరో అయ్యాడు. మరో తమ్ముడు రాజకీయ నాయకుడు అయ్యాడు. ఇదంతా పూరి దర్శకుడిగా సక్సెస్ అయిన తర్వాత తన కుటుంబంలో వచ్చిన మార్పులివి. ఇక పూరి ఆ స్థాయికి చేరుకోవడానికి తానెంత కష్టపడ్డాడో కూడా తెలిసింది. తన కష్టాలే తనని ఆ స్థాయికి తీసుకెళ్లాయి అన్నది అంతే వాస్తవం. కేవలం ప్రతిభ..కష్టంతో ఎదిగిన దర్శకుడు పూరి.
ఇక పూరి ఫ్యామిలీ అంటే ఆయన భార్య లావణ..పిల్లలు అందరికీ తెలిసిన వారే. మరి ఆ గొప్ప దర్శకుడిని కన్న తల్లి ఎవరు? ఆమె ఎలా ఉంటారు? అన్నది ఇంతవరకూ ఎక్కడా చూడలేదు. తొలిసారి పూరి తల్లి మీడియా ముందుకొచ్చారు. ఆమె పేరు అమ్మాజి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ పెద్దావిడ కుమారుడు కష్టాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవి ఏంటో ఆమె మాట్లోనే...
' ఏడవ తరగతి నుంచి పూరి జగన్నాథ్ కి సినిమాలపై ఇష్టం పిచ్చిగా మారింది. కాలేజ్ లో చదువు తున్నప్పుడు కూడా ధ్యాసంతా సినిమాపైనే ఉండేది. సినిమాల్లోకి వెళతా .. డైరెక్టర్ ను అవుతా అనేవాడు. పూరి ఇష్టాన్ని గుర్తించిన వాళ్ల నాన్న కూడా అందుకు ఒప్పుకున్నారు. అలా హైదరాబాద్ కి వచ్చి 12 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. మేము డబ్బులు పంపిచినా అవి చాలక.. తెలిసిన పనులు చేసి రోజు గడిపేవాడు. కథలు పట్టుకుని ఆఫీసులు చుట్టూ తిరిగేవాడు. ఎంత దూరమైనా నడిచే వెళ్లేవాడు.
నిరంతరం పనిచేస్తూనే ఉండేవాడు. అలా ఓసారి తిరిగి ఇంటికొచ్చేసరికి అప్పుడు నేను ఇంటి దగ్గరే ఉన్నాను. కాలి పాదాలు వాచిపోయి సాక్సులు బయటకు రాలేదు. మా అబ్బాయి కష్టాలు చూడలేక మనూరు వెళ్లిపోదాం..వ్యవసాయం చేసుకుందా అనేదాన్ని. నేను అలా అంటే బాధపడొద్దు. దేవుడు ఉన్నాడులే అనేవాడు. ఆ తర్వాత కొంత కాలానాకి పవన్ కల్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. ఆయన కథ మార్చమంటే పూరి మార్చనని చెప్పాడట. 'నీలో ఆ నిజాయతీ నచ్చింది' అని చెప్పి అవకాశం ఇచ్చారట. ఆ సంగతి నాకు చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది' అని తల్లి ఎమోషనల్ అయ్యారు.