'పుష్ప‌-2'పై ఆయ‌న పంచ్ క‌రెక్టేనా?

అయితే తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత రాకేష్ రోష‌న్ 'పుష్ప‌-2' చిత్రాన్ని విశ్లేషించి సెటైర్ వేసారు.

Update: 2025-01-16 05:52 GMT

ఇటీవ‌ల రిలీజ్ అయిన 'పుష్ప‌-2' పాన్ ఇండియాలో ఎలాంటి రికార్డులు న‌మోదు చేసిందో తెలిసిందే. భార‌తీయ చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో భారీ వ‌సూళ్లు సాధించిన రెండ‌వ చిత్రంగా, టాలీవుడ్ లో నెంబ‌వ‌ర్ వ‌సూళ్ల చిత్రంగానూ నిలిచింది. 'బాహుబ‌లి -2' రికార్డుల‌ను సైతం చెరిపేసి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. బాలీవుడ్ లో ఏకంగా 850 కోట్ల‌పైగా వ‌సూళ్లు సాధించి అక్క‌డా జెంటా పాతేసింది. ఓ డ‌బ్బింగ్ సినిమా ఇలాంటి సంచ‌ల‌నం న‌మోదు చేయ‌డం అన్ని భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇదే మొద‌టిసారి.

అయితే ఓతెలుగు సినిమా హిందీలో ఇంత స‌క్సెస్ సాధిస్తే దీని గురించి ఉత్త‌రాది స్టార్లు ఎవ‌రూ పెద్ద‌గా స్పందించ లేదు. అమితాబ‌చ్చ‌న్ ఒక్క‌రే బ‌న్నీని ప్ర‌శంసించారు త‌ప్ప మిగిలిన వారంతా అక్క‌సుతో వ్య‌వ‌హ‌రించిన‌ట్లే హైలైట్ అయింది. కంగ‌న కూడా బాలీవుడ్ పై త‌న‌దైన శైలిలో సెట‌ర్లు గుప్పించింది. అలాగే తెలుగునిర్మాత నాగవంశీ కూడా బాలీవుడ్ నిద్ర‌లేని రాత్రుళ్లు గ‌డుపుతుందంటూ సెటైర్ వేసారు. ప్ర‌తిగా బాలీవుడ్ కూడా వంశీ మాట‌ల‌కి గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చింది.

అయితే తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత రాకేష్ రోష‌న్ 'పుష్ప‌-2' చిత్రాన్ని విశ్లేషించి సెటైర్ వేసారు. ద‌క్షిణాది సినిమాలు చాలా గ్రౌన్డెడ్. మూలాల‌కు క‌ట్టుబ‌డిన సినిమాలు. అవి పాత‌వైన పంథాలో వెళ్తూ పాట‌లో యాక్ష‌న్, డైలాగ్ లో భావోద్వేగాలు హైలైట్ అవుతుంటాయి. ఇది పాత ఫార్ములానే. చాలా కాలంగా ఇదే విధాన‌లో సౌత్ సినిమా లున్నాయి. ఇందులో కొత్తేముంది? ఆ ప‌ద్ద‌తులు ఇప్ప‌టికీ ఆచారంలో ఉన్నాయి.

అది సినిమాకి క‌నెక్టింగ్ పాయింట్. రొటీన్ క‌థ‌తో తీసిన సినిమా. బాలీవుడ్ అంద‌కు భిన్నం అన్న‌ట్లు వ్యాఖ్యా నించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే రోష‌న్ వ్యాఖ్య‌ల‌తో కొంత మంది ఏకీభ విస్తున్నారు. ఈ విధమైన సినిమాలు తెలుగు వాళ్ల‌కు కొత్త కాద‌ని...నార్త్ ఆడియ‌న్స్ కి కొత్త ఫీల్ ని అందించడంతోనే సినిమా అంత పెద్ద విజ‌యం సాధించిందంటున్నారు. ఓ క‌మ‌ర్శియ‌ల్ సినిమాలా ఉంది త‌ప్ప కొత్త‌ద‌నం ఏముంద‌ని మ‌రికొంత మంది అంటున్నారు.

Tags:    

Similar News