పుష్ప 2- ఆమెను వదిలేసి తప్పు చేశారా?

శ్రద్ధా కపూర్ ని తీసుకొని ఉంటే కచ్చితంగా 'పుష్ప 2' కి నార్త్ లో మంచి హైప్ లభించేదని

Update: 2024-11-03 07:15 GMT

'పుష్ప 2' సినిమాలోని ఐటెం సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్స్ పేర్లు సుకుమార్ పరిశీలించారు. ఒకానొక దశలో బాలీవుడ్ బ్యూటీ శ్రధ్దా కపూర్ కన్ఫర్మ్ అయ్యిందని అనుకున్నారు. ఆమె మంచి టాలెంటెడ్ డాన్సర్. ఇప్పటికే చాలా సినిమాలలో ఆమె డాన్స్ టాలెంట్ ఏంటనేది ఆడియన్స్ చూసేసారు. దీంతో అల్లు అర్జున్, శ్రద్ధా కపూర్ కలయికలో డాన్స్ నెంబర్ పడితే థియేటర్స్ షేక్ అవ్వడం గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు.

అయితే 'పుష్ప 2' లోని ఐటెం సాంగ్ కోసం ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని ప్రచారం నడుస్తుంది . ఈ నేపథ్యంలో ఒక్క సాంగ్ కోసం సౌత్ హీరోయిన్స్ కి ఇచ్చే స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వాలంటే కష్టం అని మేకర్స్ భావించారు అని వినిపిస్తుంది . దీంతో ప్రత్యామ్నాయంగా శ్రీలీలని కన్ఫర్మ్ చేశారు అట . శ్రీలీల కూడా మంచి డాన్సర్. అయితే క్రేజ్ పరంగా చూసుకుంటే శ్రద్ధా కపూర్ కి పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉంది.

1000 కోట్ల బిజినెస్ జరిగిన సినిమాలో రెమ్యునరేషన్ కారణం చూపించి తప్పించి ఉంటె పొరపాటేనని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రద్ధా కపూర్ ఈ ఏడాది 'స్త్రీ 2' మూవీతో హిందీలో బ్లాక్ బస్టర్ అందుకుంది. నార్త్ లో ఆమెకి మంచి క్రేజ్ ఉంది. 'పుష్ప 2' లో ఐటెం సాంగ్ కోసం ఆమెని తీసుకొని ఉంటే కచ్చితంగా హిందీ మార్కెట్ లో సినిమాకి మరింత హెల్ప్ అయ్యేదని అంటున్నారు.

శ్రీలీల డాన్స్ పెర్ఫార్మెన్స్ అందరికి కనెక్ట్ అయిన బాలీవుడ్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేంత సామర్ధ్యం ఆమెకి లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రద్ధా కపూర్ ని తీసుకొని ఉంటే కచ్చితంగా 'పుష్ప 2' కి నార్త్ లో మంచి హైప్ లభించేదని, అలాగే కలెక్షన్స్ పైన కూడా ఆమె ప్రభావం ఉండేదని సినీ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

ఏది ఏమైనా శ్రద్ధా కపూర్ ని వదులుకొని తప్పుచేశారని అంటున్నారు. 'పుష్ప 2' సినిమాకి అల్లు అర్జున్ ఛరిష్మా చాలని అతనిఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ ఆడియన్స్ ని ప్రభావితం చేసే కెపాసిటీ బన్నీకి ఉందని, 'పుష్ప 2' మూవీ 1000 కోట్ల కలెక్షన్స్ చాలా ఈజీగా అందుకుంటుందని నమ్మకంగా చెబుతున్నారు. మరి ఫ్యాన్స్ నమ్మకాన్ని 'పుష్ప 2' ఏ మేరకు అందుకుంటుందనేది వేచి చూడాలి. ఒక వేళ ఈ సినిమా 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధిస్తే మాత్రం కచ్చితంగా బన్నీ మార్కెట్ పెరిగినట్లేనని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Tags:    

Similar News