సీడెడ్ టాప్ కలెక్షన్స్… పుష్ప 2 స్థానం ఏంటంటే?

బాహుబలి 2’ కలెక్షన్స్ ని క్రాస్ చేసుకొని ‘పుష్ప 2’ సీడెడ్ లో రెండో స్థానంలోకి వచ్చింది. ‘బాహుబలి 2’ మూవీ లాంగ్ రన్ లో 34.75 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

Update: 2025-01-06 12:04 GMT

సీడెడ్ అంటే రాయలసీమ రీజియన్ లో ఉన్న జిల్లాలు ఎక్కువగా వస్తాయి. ఈ ప్రాంతంలో భారీ కలెక్షన్స్ అందుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. కొంతమంది హీరోలకి మాత్రమే సీడెడ్ లో ఎక్కువ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే సీడెడ్ లో ఎక్కువగా బీ,సి సెంటర్లు ఉంటాయి. అందుకే మాస్ ఆడియన్స్ కి చేరువ అయ్యే కథలకి మాత్రమే అక్కడ ప్రేక్షకుల పెద్దపీట వేస్తారు.

‘పుష్ప 2’ మూవీ కథాంశం అంతా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు నేపథ్యంలో ఈ మూవీ కథని దర్శకుడు సుకుమార్ చెప్పారు. అందుకే అక్కడి ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ‘పుష్ప 2’ సినిమాలోని ఎలిమెంట్స్ అన్ని కూడా రాయలసీమ ఆడియన్స్ కి చేరువ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ మూవీ ఏకంగా 35.10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లో ఈ సినిమా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే సీడెడ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో ‘ఆర్ఆర్ఆర్’ ఉంది. ఈ చిత్రం ఏకంగా 51.04 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ‘బాహుబలి 2’ కలెక్షన్స్ ని క్రాస్ చేసుకొని ‘పుష్ప 2’ సీడెడ్ లో రెండో స్థానంలోకి వచ్చింది. ‘బాహుబలి 2’ మూవీ లాంగ్ రన్ లో 34.75 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ మూవీ ‘దేవర పార్ట్ 1’ కూడా సీడెడ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 31.85 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. గత ఏడాది రిలీజ్ అయిన మూడు పాన్ ఇండియా సినిమాలలో రెండు 30+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని సీడెడ్ లో అందుకున్నాయి. ఇక సీడెడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో టాప్ 5 లో ‘సలార్ పార్ట్ 1’ ఉంది. ఈ చిత్రం 22.75 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక ఓవరాల్ గా సీడెడ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది.

ఆర్ఆర్ఆర్ - ₹51.04 కోట్లు

పుష్ప 2: ది రూల్ - ₹35.10 కోట్లు

బాహుబలి 2 - ₹34.75 కోట్లు

దేవర పార్ట్ 1 - ₹31.85 కోట్లు

సలార్ పార్ట్ 1 - ₹22.75 కోట్లు

బాహుబలి - ₹21.80 కోట్లు

కల్కి 2898ఏడీ - ₹21.80 కోట్లు

సైరా - ₹19.11 కోట్లు

వాల్తేరు వీరయ్య - ₹18.35 కోట్లు

అల వైకుంఠపురములో - ₹18.27 కోట్లు

Tags:    

Similar News