కిక్కిచ్చేలా పుష్ప రాజ్ - శ్రీవల్లి స్టైలిష్ పోజ్
"పుష్ప రాజ్ అండ్ శ్రీవల్లి" అని అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోపై అభిమానులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ముంబైలో పుష్ప 2 ది రూల్ ప్రమోషన్ ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించారు. బ్లాక్ కలర్ ఎలిగెంట్ డ్రెస్‌లో ఇద్దరూ స్టేజీపై ఇచ్చిన ఈ స్టైలిష్ పోజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "పుష్ప రాజ్ అండ్ శ్రీవల్లి" అని అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోపై అభిమానులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. సినిమా ప్రమోషన్లో ఇలాంటి క్యాజువల్ అండ్ స్టైలిష్ ఎలిమెంట్స్‌ను జోడించడం హైలెట్ గా నిలుస్తోంది.
పుష్ప 2 ది రూల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటి భాగం “పుష్ప: ది రైస్” కంటే ఈ సీక్వెల్ మరింత గ్రాండ్‌గా ఉండబోతోందని ట్రైలర్లు, పోస్టర్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా మరింత పవర్ఫుల్ రోల్లో కనిపించబోతుండగా, రష్మిక శ్రీవల్లి పాత్రలో తన ప్రత్యేకతను చూపనున్నారు. ఫహద్ ఫాసిల్ కూడా మరోసారి సీరియస్ పాత్రలో నటిస్తున్నారు.
పుష్ప 2 ప్రమోషన్స్ మొదటి నుంచే వినూత్నంగా ఉన్నాయి. పట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉత్తరాదిలో కూడా సినిమాపై క్రేజ్‌ను పెంచింది. అలాగే ముంబై ఈవెంట్ ద్వారా బాలీవుడ్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ, సినిమా పాన్-ఇండియా రేంజ్‌ను మరోసారి రుజువు చేశారు. బన్ని మరియు రష్మిక వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ నుండి స్టేజ్ పై ఇచ్చిన పోజ్ వరకు ప్రతీది ట్రెండింగ్ అవుతోంది.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, సామ్ సిఎస్ కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో కీలకంగా వ్యవహరించబోతున్నారు. పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కానుండగా, ఇది ఈ ఏడాది చివరి బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలున్నాయి.
అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని చూపుతూ, సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. "పుష్ప 2" తో బన్నీ తన రేంజ్‌ను మరింత పెంచుతారని అందరూ విశ్వసిస్తున్నారు. సినిమా ప్రమోషన్లకు మరో స్థాయికి తీసుకురావడంలో పుష్ప టీమ్ మరోసారి ముందంజలో నిలిచిందని చెప్పాలి. ఇటువంటి వినూత్న ప్రమోషన్ స్ట్రాటజీస్, స్టైలిష్ ఎలిమెంట్స్ పుష్ప 2ను పాన్ ఇండియా స్థాయిలో పెద్ద విజయంగా మార్చే అవకాశాలు చూపిస్తున్నాయి. ఇక డిసెంబర్ 5న థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాక, ఇది ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాలి.