పుష్ప 2 బాక్సాఫీస్ - ఓపెనింగ్స్ తోనే బ్రాండ్ దద్దరిల్లింది!

ఇండియన్ సినిమా చరిత్రలో అల్లు అర్జున్ బ్రాండ్ కూడా దద్దరిల్లింది. 'పుష్ప 2: ది రూల్' విడుదలకు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది

Update: 2024-12-06 04:16 GMT

ఇండియన్ సినిమా చరిత్రలో అల్లు అర్జున్ బ్రాండ్ కూడా దద్దరిల్లింది. 'పుష్ప 2: ది రూల్' విడుదలకు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మొదటి రోజునే రికార్డులను తుడిచిపెట్టింది. అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ఈ చిత్రం మొదటి భాగం 'పుష్ప 1' తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పింది. ఆ అంచనాలను నిజం చేస్తూ, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభించింది. 1549 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఏపి, తెలంగాణలో తొలి రోజునే 73 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. A సెంటర్స్ ఆడియెన్స్ కూడా విజిల్స్ వేస్తున్నారు. ఇక బీ, సీ సెంటర్స్‌ నుంచి కూడా ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. ఈ గణాంకాలు తెలుగు చిత్రపరిశ్రమలో 'పుష్ప 2' స్థాయి ఎంత పెద్దదో తెలియజేస్తున్నాయి.

అంతేకాకుండా, హిందీ మార్కెట్‌లో కూడా పుష్ప 2 రికార్డు స్థాయిలో ముందుకు దూసుకెళ్లింది. 67 కోట్ల భారీ వసూళ్లతో, ఉత్తరాదిన కూడా ఈ చిత్రం అల్లు అర్జున్ క్రేజ్‌ను మరింత పెంచింది. ఇక ఓవర్సీస్ లెక్కలు కూడా ఊహించని స్థాయిలోనే ఉన్నాయి. అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా $3.3-$3.5 మిలియన్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, మెరుగైన రన్‌ను కొనసాగించాల్సి ఉంది.

ఇక, సౌత్ లో చూసుకుంటే తమిళనాడు నుంచి 8 కోట్లు, కర్ణాటక నుంచి 15 కోట్లు, కేరళ నుంచి కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా కలిపి 250 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ ప్రీమియర్ షోలతో కూడా ముందుగానే హై రెంఙ్ లో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో, కొన్ని థియేటర్లలో ఫుల్ హౌస్ బోర్డులు దర్శనమిచ్చాయి.

అనుకున్నట్లే పుష్ప 2 మొదటి రోజు రికార్డు కలెక్షన్స్‌ రాబట్టడం చర్చనీయాంశమైంది. ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచడం వల్ల కొంత విమర్శలు వచ్చినప్పటికీ, అభిమానులు ఈ సినిమాను భారీ విజయంగా నిలబెట్టారు. 'పుష్ప 2' సాధించిన ఈ ఘనతతో అల్లు అర్జున్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డు సృష్టించిన స్టార్‌గా నిలిచారు. ఈ చిత్ర ప్రస్థానం ఎంతదూరం వెళ్తుందో చూడాల్సి ఉంది, కానీ మొదటి రోజు వసూళ్లు చూస్తే, 'పుష్ప 2' దేశీయ సినిమా మార్కెట్‌పై గట్టి ప్రభావం చూపనుందని అర్ధమవుతుంది.

Tags:    

Similar News